100 Crore Vaccination Milestone : ట్విటర్ ప్రొఫైల్ పిక్ మార్చిన నరేంద్ర మోడీ..

By AN TeluguFirst Published Oct 22, 2021, 1:07 PM IST
Highlights

PM మోడీ ప్రొఫైల్ పిక్చర్, "అభినందనలు ఇండియా -100 కోట్ల COVID-19 వ్యాక్సిన్ డోస్‌లు విజయవంతంగా పూర్తి చేశాం" అని క్యాప్షన్ ఉంది. ఈ రికార్డ్ సాధించిన తరువాత ప్రధాని మోడీ శుక్రవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు, ఈ సమయంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోస్ మైలురాయిని దాటినందుకు ప్రశంసించారు. 

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విటర్ profile pictureను మార్చారు. భారత్ వందకోట్ల కోవిడ్-19 టీకా మైలురాయిని సాధించిన ఘనతను పురస్కరించుకుని ప్రధాని Narendra Modi శుక్రవారం తన ట్విట్టర్ హ్యాండిల్ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారు.

PM మోడీ ప్రొఫైల్ పిక్చర్, "అభినందనలు ఇండియా -100 కోట్ల COVID-19 వ్యాక్సిన్ డోస్‌లు విజయవంతంగా పూర్తి చేశాం" అని క్యాప్షన్ ఉంది. 

ఈ రికార్డ్ సాధించిన తరువాత ప్రధాని మోడీ శుక్రవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు, ఈ సమయంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోస్ మైలురాయిని దాటినందుకు ప్రశంసించారు. తన ప్రసంగంలో, భారతదేశం టీకా కార్యక్రమం science-born అని, ఇది శాస్త్రీయాధారితంగా, సాంకేతిక బేస్ తో కూడుకున్నదని ప్రధాన మంత్రి అన్నారు. 

అలాగే ఈడ్రైవ్‌లో "VIP culture" లేదని ఆయన నొక్కిచెప్పారు. పండుగ సీజన్‌లో ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించకుండా పండుగలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ covid-19 రక్షణ విషయాలను మరిచిపోకూడదని కోరారు. 

దేశంలోని టీకా డ్రైవ్ అంతా science-born, science-driven, science-basedగానే సాగిందని, అది తనకు చాలా గర్వకారణంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. 

టీకాలను అభివృద్ధి చేయడం నుంచి టీకాలు వేయడం వరకు, శాస్త్రీయ రీతిలో, సైన్స్ ఆధారిత విధానంలోనే జరిగిందని... అన్ని ప్రక్రియలలోనూ దాన్నే ఫాలో అయ్యామని ఆయన నొక్కిచెప్పారు. అంతేకాదు.. దేశంలోని ’ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్.. ఉచిత వ్యాక్సిన్’ అనే కార్యక్రమం తీసుకున్నామని గుర్తు చేశారు. 

వ్యాధికి ఎలాంటి వివక్షా ఉండదు.. అలాగే వ్యాక్సినేషన్ కూ ఎలాంటి వివక్షా ఉండదని.. ఇది దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ చూపించిందని చెప్పుకొచ్చారు. "అందుకే టీకా డ్రైవ్ లో VIP సంస్కృతిని అనుమతించలేదని" ఆయన అన్నారు. 

భారతదేశం గురువారం ఉదయం 100 కోట్ల COVID-19 వ్యాక్సిన్ డోస్‌ల  మైలురాయిని సాధించింది.ఈ విజయానికి పలువురు world leaders భారతదేశాన్ని అభినందించారు. పిఎం మోడీ గురువారం కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీదారులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు, టీకా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉండగా.. వంద కోట్ల కరోనా వ్యాక్సిన్ మైలు రాయిని అధిగమించడం భారత ప్రజల విజయమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 21 నాటి దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించినట్టుగా మోడీ చెప్పారు. వంద కోట్ల  వ్యాక్సిన్ మైలురాయిని దాటి చరిత్ర సృష్టించామన్నారు.

శుక్రవారం నాడు ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి Narendra Modi ప్రసంగించారు. భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచ చేశాలు కొనియాడుతున్నాయని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయన్నారు. 

కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని మోడీ తెలిపారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా వ్యాక్సిన్ మన నివాదం అని ఆయన చెప్పారు. అన్ని వర్గాల వారికి వ్యాక్సిన్ అందించినట్టుగా ఆయన వివరించారు. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఈ విజయం సాధ్యమైందని మోడీ అభిప్రాయపడ్డారు.

ఇంత పెద్ద దేశానికి టీకాల సరఫరా అనేది పెద్ద సవాల్. అయితే ఈ సవాల్ ను అధిగమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మన దేశం ఎంత సంకల్పబద్దంగా ఉంటుందో కరోనా వ్యాక్సిన్ లో 100 కోట్ల మైలురాయిని అధిగమించడమే నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో 100 కోట్ల వ్యాక్సిన్ లు ఇచ్చి చరిత్ర సృష్టించామని మోడీ చెప్పారు.భారత ఫార్మారంగం శక్తి మరోసారి ప్రపంచానికి తెలిసిందని మోడీ అభిప్రాయపడ్డారు.

కొత్త చరిత్ర సృష్టించాం,ప్రపంచం చూపు మనవైపే : 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ పంపిణీపై మోడీ

ఇండియాలో Corona Vaccine  పంపిణీ ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైంది. వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైన 279 రోజుల్లోనే 100 కోట్ల మైలు రాయిని వ్యాక్సిన్ దాటింది. దేశంలో ప్రతి రోజూ 35,84,223 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్టుగా Icmr రికార్డులు చెబుతున్నాయి.దేశంలో ఇప్పటివరకు  70 శాతం మందికి ఒక్కడోసు, 31 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తైంది.

click me!