రైతుల ఆందోళ వేదిక వద్ద మరోసారి కలకలం.. ఓ వ్యక్తిపై పదునైన ఆయుధంతో దాడి..

By team teluguFirst Published Oct 22, 2021, 12:29 PM IST
Highlights

ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో రైతులు ఆందోళ చేస్తున్న  వేదిక వద్ద (farmers protest site) మరోసారి  కలకలం రేగింది. రైతులు  ఆందోళ చేస్తున్న చోటే  మరో వ్యక్తిపై దాడి జరిగింది.

ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో రైతులు ఆందోళ చేస్తున్న  వేదిక వద్ద (farmers protest site) మరోసారి  కలకలం రేగింది. గత వారం ఓ వ్యక్తిని  సిక్కుల పవిత్ర గ్రంథాన్ని అవమానపరిచాడనే ఆరోపణలతో ఓ  వ్యక్తిని నిహాంగ్ సిక్కులు దారుణంగా  హత్య చేసిన  సంగతి తెలిసిందే.  అయితే ఈ ఘటన మరవక  ముందే.. రైతులు  ఆందోళ చేస్తున్న చోటే  మరో వ్యక్తిపై దాడి జరిగింది. ఇందుకు సంబంధించి నిహంగ్  గ్రూప్‌కు చెదిన ఓ వ్యక్తిని  పోలీసులు  అరెస్ట్ చేశాడు. ఈ దాడిలో గాయపడిన  మనోజ్  పాశ్వాన్‌కు సంబంధించిన  రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్  మీడియాలో చక్కర్లు  కొడుతున్నాయి. ఓ వీడియోలో మనోజ్  పాస్వాన్  హాస్పిట్‌ బెడ్‌పై తన దాడి ఎలా  జరిగిందో  చెప్పాడు. 


‘నేను  పౌల్ట్రీ ఫామ్  నుంచి కోళ్లను  రవాణా చేస్తున్నాను..  నన్ను సింఘు సరిహద్దుల్లో ఓ వ్యక్తి  ఆపి  కోడిని ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే  అలా ఇవ్వడం  కుదరదని.. నేను షాప్ యజమానికి, పౌల్ట్రీ ఓనర్స్‌కు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నాను. రవాణా చేసే  వాటిలో ఏదైనా మిస్ అయితే నా ఉద్యోగం పోతుందని చెప్పాను. సమీపంలోని పౌల్ట్రీ ఫామ్‌కి వెళ్లి అక్కడ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చని నేను ఆ వ్యక్తికి చెప్పాను. అతడికి నా వద్ద ఉన్నఇన్‌వాయిస్ స్లిప్ కూడా చూపించాను.  అయితే అంత చెప్పినప్పటికీ అతడు గొడ్డలి  వంటి  పదునైన ఆయుధంతో నాపై దాడి చేశాడు’అని మనోజ్ పాశ్వాన్  ఆరోపించాడు. ఇక,  పాశ్వాన్ కాలికి గాయమైనట్టుగా ఈ వీడియోలో కనిపిస్తుంది.

Also read: టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు.. యువతి ఫిర్యాదుతో

ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘు సరిహద్దుల్లోని రైతుల నిరసన స్థలం వద్ద నిహాంగ్ వర్గానికి చెందిన సభ్యులు హింసాత్మక  చర్యలకు పాల్పడం  ఇది రెండోసారి. ఇటీవల దళిత రోజువారీ కూలీ కార్మికుడు లఖ్‌బీర్ సింగ్ ఆ ప్రదేశంలో దారుణంగా హత్య చేయబడ్డాడు. తమ పవిత్ర గ్రంథాన్ని అవమానపరిచాడని  నిహాంగ సిక్కులు  ఈ దారుణానికి పాల్పడ్డారు. అతడి చేతులు నరికివేసి  అత్యంత  క్రూరంగా హత్య చేశారు.  అనంతరం  అతని  మృతదేహాన్ని  పోలీసు బారికేడ్లకు కట్టివేశారు. దీనిపై రైతు సంఘాల నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ చర్యకు పాల్పడిన  వారిని  కఠినంగా శిక్షించాలని  డిమాండ్  చేశారు. 

click me!