అద్భుతం: హుగ్లీ నది దిగువన మెట్రో రైలు సేవలు

By narsimha lode  |  First Published Mar 6, 2024, 7:58 AM IST

నది దిగువన మెట్రో రైలు  సేవలు బెంగాల్ వాసులకు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే నది దిగువన తొలి మెట్రో రైలు మార్గంగా రికార్డు సృష్టించనుంది. 


న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం నాడు ఈ మెట్రో సేవలను ప్రారంభించనున్నారు. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని  హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగమార్గంలో మెట్రో రైలు  సేవలను  మోడీ ఇవాళ ప్రారంభిస్తారు.ఈ మెట్రో రైలు ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు.  ఇవాళ కోల్‌కత్తాలోని మెట్రో రైల్వేలోని హౌరా మైదాన్-ఎస్పా‌న్లేడ్ సెక్షన్ ను మోడీ ప్రారంభిస్తారు.హుగ్లీ నది కింద హౌరా మైదాన్-ఎన్‌ప్లనేడ్ లను కలుపుతూ 4.8 కి.మీ. మేర ఈ గ్రీన్ లైన్ ను నిర్మించారు. ఈ మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో53 ఏళ్ల కోల్‌కత్తా వాసుల కలను నెరవేరనుంది.

Latest Videos

also read:నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

నది కింద ఏర్పాటు చేసిన సొరంగం తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్ ప్రాజెక్టులో ఒక భాగం. ఇది సాల్ట్ లేక్ లోని సెక్టార్ ఐదు నుండి ప్రారంభమై సీల్దా వద్ద ముగుస్తుంది.  మొత్తం 16.6 కి.మీ.లలో  10.8 కి.మీ. భూగర్భంలోనే రైలు మార్గం ఉంటుంది. అంతేకాదు హౌరా మెట్రో రైల్వే స్టేషన్ అత్యంత లోతైందిగా అధికారులు చెబుతున్నారు. 1971లో  నది కింది భాగం నుండి  మెట్రో రైలు పనులు చేపట్టాలని  భావించారు. అయితే  ఈ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు 2008లో మంజూరయ్యాయి.

also read:పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: జాబితా రెడీ, రాహుల్ పోటీపై రాని స్పష్టత

హౌరా మైదాన్ నుండి ఎస్ప్లానేడ్ వరకు  రూ. 4,138 కోట్లతో ఈ మార్గాన్ని నిర్మించారు. ఈ రైలు మార్గం ద్వారా ప్రజా రవాణాకు దోహదపడనుందని అధికారులు చెప్పారు. మరో వైపు ట్రాఫిక్ రద్దీని కూడ ఈ సమస్య పరిష్కరించనుంది. మరో వైపు కాలుష్యం కూడ గణనీయంగా తగ్గనుంది  అధికారులు చెబుతున్నారు.

also read:విశాఖపట్టణంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా: ఏపీ రాజధానిపై జగన్ సంచలనం

హుగ్లీ, మిడ్నపూర్, హౌరా సహా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణీకులకు ఈ మార్గం మరింత మెరుగైన సేవలను అందించనుందని  రైల్వే అధికారులు చెప్పారు.2014 నుండి  2023 వరకు  బెంగాల్ రాష్ట్రంలోని పెండింగ్ లో ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు  భారతీయ రైల్వే శాఖ కృషి చేసిందని సీనియర్ రైల్వే అధికారులు చెబుతున్నారు.కోల్‌కత్తా సహా పరిసర ప్రాంతాల్లోని  పెండింగ్ లో ఉన్న  రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు  రూ. 18,212 కోట్లు ఖర్చు చేసినట్టు భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. 


 

click me!