2024 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం: సంజయ్ రౌత్

By narsimha lodeFirst Published Oct 31, 2021, 3:04 PM IST
Highlights

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా ఏ పార్టీ కూడ ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేయలేదని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. పుణెలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పుణె:  2024 సార్వత్రిక ఎన్నికల్లో congress లేకుండా ఏ ఒక్క పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని Shiv sena అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ Sanjay Raut అభిప్రాయపడ్డారు.వచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం కేంద్రంలోకి అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుందని ఆయన గుర్తు చేశారు. పుణె ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన జేఎస్ కరాండీకర్ స్మారకోపాన్యాసంలో ఆయన ప్రసంగించారు.

కొన్ని దశాబ్దాలపాటు కేంద్రంలో Bjp అధికారంలో ఉంటుందని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై  ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో bjp ఉంటుంది. కానీ ఆ పార్టీ అధికారంలో ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రస్తుతానికి తాము దాద్రానగర్ హవేలీ,  గోవా ఎన్నికలపై దృష్టి సారించామన్నారు. యూపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఆయన చెప్పారు.

ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా బీజేపీ చెప్పుకొంటుందన్నారు. అయితే ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే ప్రతిపక్ష పార్టీగా ఉంటుందన్నారు. మహారాష్ట్రలో 105 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ఉందని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు.మహరాష్ట్రలో కాంగ్రెస్, ncpతో కలిసి శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కేంద్ర ప్రభుత్వం మంత్రులను మీడియాకు దూరంగా ఉంచుతుందని చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో కూడా మీడియాపై ఈ రకంగా  నిర్భంధం లేదని ఆయన చెప్పారు.అనుకూలంగా లేని మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకొందని ఆయన విమర్శలు గుప్పించారు. 

 తనకు అనుకూలమైన మీడియా రిపోర్టింగ్ ను మాత్రమే కేంద్రం కోరుకొంటుందన్నారు. కరోనా సమయంలో గంగా నదిలో శవాలు తేలుతున్నాయని రిపోర్టు చేసిన మీడియా సంస్థపై Income tax దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు.దేశంలోని ప్రఖ్యాతి చెందిన పది పరిశ్రమలు media house సంస్థలను కొనుగోలు చేశాయన్నారు.దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్నారు.

దేశంలో బీజేపీని గద్దెదించడానికి విపక్షాలు ఫ్రంట్ ఏర్పాటుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను కూడగట్టేందుకు ప్రయత్నించింది.  ప్రాంతీయ పార్టీల కూటమి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదే విషయాన్ని సంజయ్ రౌత్ చెప్పారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని  గద్దె దింపాలంటే ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల సహకారం బీజేపీ అనివార్యం. అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొంటే తమ విజయావకాశాలు దెబ్బతింటున్నాయని కూడ కొన్ని ప్రాంతీయ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అధికారానికి దూరం కావడానికి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సీట్లు కూడా కారణమనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు తమ కొంపముంచిందనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలున్నారు. ఇదే అభిప్రాయాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ వ్యక్తం బహిరంగంగా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల్లో విశ్వాసం పాదుకొల్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకొంటుందో చూడాలి.

click me!