కేరళలో మోడీ టూర్: గురువాయర్ శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

By narsimha lode  |  First Published Jan 17, 2024, 12:53 PM IST


 రెండు రోజుల పర్యటనకు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న కేరళ రాష్ట్రానికి చేరుకున్నారు.



తిరువనంతపురం: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  కేరళ రాష్ట్రంలోని గురువాయర్ లోని శ్రీకృష్ణుడి ఆలయంలో బుధవారం నాడు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మోడీ  కృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ నెల  16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వీరభధ్రస్వామి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాయాణానికి సంబంధించి ఈ ఆలయంతో సంబంధం ఉన్నట్టుగా పురాణ గాధలు చెబుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ నుండి నిన్ననే  ప్రధాన మంత్రి కేరళ పర్యటనకు వెళ్లారు.  

Latest Videos

also read:అధర్మంగా అధికారం దక్కినా స్వీకరించను: నాసిన్ ప్రారంభోత్సవ సభలో మోడీ సంచలనం

గురువాయర్ ఆలయంలో  పూజలు నిర్వహించిన తర్వాత నటుడు, రాజకీయ నేత సురేష్ గోపి కూతురు వివాహానికి  మోడీ హాజరయ్యారు.ఈ వివాహా కార్యక్రమంలో  సినీ నటులు  మోహన్ లాల్,  దిలీప్ సహా  పలువురు మళయాల సినిమా నటీనటులు పాల్గొన్నారు.మళయాల సినీ నటులతో  ప్రధానమంత్రి ముచ్చటించారు.

also read:వై.ఎస్. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు: నాడు తండ్రి, నేడు తనయ

ఇవాళ ఉదయం  గురువాయర్ ఆలయంలో  వివాహం చేసుకున్న జంటను కూడ మోడీ ఆశీర్వదించారు. గురువాయర్  ఆలయంలో శ్రీకృష్ణుడి దర్శనం కోసం మోడీ వస్తున్న నేపథ్యంలో  ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇవాళ ఉదయం ఏడున్నర గంటలకు  గురువాయర్ శ్రీకృష్ణ కాలేజీ మైదానానికి చేరుకున్నారు. మోడీకి బీజేపీ కార్యకర్తలు  ఘనంగా స్వాగతం పలికారు. 

also read:వై.ఎస్.షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు: జగన్‌పై డైరెక్ట్ ఫైట్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  హెలిప్యాడ్ నుండి  శ్రీవల్సం గెస్ట్ హౌస్ కు వెళ్లారు. ఆలయానికి వెళ్లే ముందు సంప్రదాయ దుస్తులను మార్చుకున్నారు. గెస్ట్ హౌస్ నుండి  ఆలయానికి వెళ్లారు.ఇవాళ కేరళలోని త్రిస్సూర్  జిల్లాలోని త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో కూడ  ప్రార్థనలు చేస్తారు.

 

click me!