ఆపరేషపన్ సింధూర్ పర్ఫెక్ట్ స్ట్రైక్: ప్రధాని మోదీ

Published : May 07, 2025, 02:27 PM IST
ఆపరేషపన్ సింధూర్ పర్ఫెక్ట్ స్ట్రైక్: ప్రధాని మోదీ

సారాంశం

మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఆపరేషన్ సింధూర గురించి చర్చించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన వైమానిక దాడుల గురించి కేబినెట్ సహచరులకు వివరించారు ప్రధానమంత్రి మోదీ . ఇది “పర్ఫెక్ట్ స్ట్రైక్” అని అభివర్ణించారు.

ఆపరేషన్ సింధూర పేరిట పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్ధావరాలపై భారత్ బాంబుదాడులకు దిగింది. పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్ కు తగిన బుద్ది చెప్పాలని భావిస్తున్న భారత్ తాజాగా దాడులకు దిగింది. భారత వాయుసేన యుద్దవిమానాలు అర్ధరాత్రి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను నేలకూల్చాయి.  ఈ దాడిలో చాలామంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు... ఎందరో గాయాలపాలయ్యారు. 

ఈ ఆపరేషన్ సింధూరపై చర్చించేందుకు ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన వైమానిక దాడులు, తర్వాత పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్‌ను “పర్ఫెక్ట్ స్ట్రైక్” అని అభివర్ణించారు.

 

 

“ఇది మనందరికీ గర్వకారణం” అనికూడా సహచర మంత్రులతో పీఎం మోదీ అన్నట్లుగా తెలుస్తోంది. దేశ సరిహద్దులు దాటి శత్రుదేశం పాకిస్థాన్ లో ఉగ్రవాద స్థావరాలపై దాడికోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర గురించి మోదీ సహచర మంత్రులకు వివరించారు. .

 సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ సింధూరను చేపట్టిన భారత సైన్యాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. కేబినెట్ మంత్రులు ప్రధాని మోదీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశం ఆయన వెంటే ఉందని అన్నారు.

26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఘటనకు ప్రతిస్పందనగా ప్రారంభించిన ఈ ఆపరేషన్, జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు సంబంధించిన తొమ్మిది శిబిరాలను ధ్వంసం చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం జరిపిన ఆపరేషన్ సింధూర్ గురించి సమగ్ర వివరాలను పంచుకున్నాయి. 

రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, భారత దళాలు తొమ్మిది ఉగ్రవాద స్థలాలను విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ దాడులు ఆర్మీ, నేవీ, వైమానిక దళాల సమన్వయంతో జరిగాయి.ఈ మిషన్ ప్రత్యేకంగా జైష్-ఎ-మొహమ్మద్ (JeM), లష్కర్-ఎ-తొయిబా (LeT)లకు సంబంధించిన ప్రదేశాలపై దృష్టి సారించింది. రక్షణ అధికారులు లక్ష్యాలను జాగ్రత్తగా ఎంచుకున్నామని, పౌర, సైనిక సంస్థాపనలకు హాని జరగకుండా దాడులు జరిగాయని నొక్కి చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే