అయోధ్య రామమందిరం: ముఖ్య యజమాన్ అంటే ఏమిటీ?

By narsimha lodeFirst Published Jan 20, 2024, 5:12 PM IST
Highlights

అయోధ్యలో ఈ నెల  22న ప్రాణ ప్రతిష్టకు నిర్వాహకులు  అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 


న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో  శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22న నిర్వహించే ప్రధాన ఘట్టానికి  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ముఖ్య యజమాన్ గా  వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్  ప్రకటించింది.


ఈ నెల  22 వ తేదీ కంటే ముందు  జరిగే ఆరు రోజుల పాటు జరిగే ఆచార వ్యవహరాలకు  డాక్టర్ అనిల్ మిశ్రా, అతని భార్య ప్రధాన యజమాన్ గా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. 

Latest Videos

యజమాన్ ఎవరు?

యజమాన్ అనేది సంస్కృత పదం.  ఇది మతపరమైన వేడుకలో ఒక కర్మను నిర్వహించే వ్యక్తిని సూచిస్తుంది.డాక్టర్ అనిల్ మిశ్రా ప్రధాన యజమాన్ గా  ఆరు రోజుల పాటు ప్రాణ ప్రతిష్టకు చెందిన అన్ని వ్యవహరాలను  నిర్వహిస్తారని విశ్వహిందూ  పరిషత్ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు.  ఈ నెల 22 వ తేదీన జరిగే ప్రధాన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యవహరిస్తారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇతరులతో కలిసి గర్భగుడిలో కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రధాన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మోడీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్   చీఫ్ మోహన్ భగతవ్,  ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరుల సమక్షంలో జరగనుందని  ట్రస్ట్ ప్రకటించింది. 

అనిల్ మిశ్రా ఎవరు?

అయోధ్యకు చెందిన వ్యక్తే అనిల్ మిశ్రా. రామ మందిర ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ట్రస్టు సభ్యుల్లో  అనిల్ మిశ్రా కూడ ఒకరు.  40 ఏళ్లుగా ఆయన అయోధ్యలో రామాలయం  కోసం కృషి చేస్తున్నారు.  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అంబేద్కర్ నగర్ జిల్లాలో అనిల్ మిశ్రా జన్మించారు. 1981 లో బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ లో పట్టా పొందారు.  ఉత్తర్ ప్రదేశ్ హోమియో‌పతిక్ బోర్డు రిజిస్ట్రార్, గోండా జిల్లా హోమియోపతిక్ అధికారి గా  అనిల్ మిశ్రా పనిచేశారు. ఉద్యోగం నుండి రిటైరైన తర్వాత హోమియోపతి క్లినిక్ ను నడుపుతున్నాడు.

also read:అయోధ్యలోని రామమందిరం: రామ్ లల్లా విగ్రహం బ్లాక్ స్టోన్‌తోనే ఎందుకు చేశారంటే?

ప్రాణ ప్రతిష్టకు ముందు వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు  అనిల్ మిశ్రా కర్తగా వ్యవహరిస్తారు.  మంగళవారం నుండి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్దలతో  అనిల్ మిశ్రా దంపతులు ప్రారంభించారు. 

బుధవారంనాడు మిశ్రా అతని భార్య కలశపూజను నిర్వహించారు. ఆ తర్వాత కర్మలు జరుగుతున్న ప్రదేశానికి తీసుకెళ్లడానికి సరయూ నది నుండి కుండలను నింపారు.అయోధ్య రామమందిరంలో  జలయాత్ర, తీర్థపూజలు నిర్వహించారు. 

also read:అయోధ్యలో రామ మందిరం: రామ్ లల్లా విగ్రహం 51 ఇంచులే ఎందుకు?

శనివారం నాడు ఉదయం శర్కరాధివాసాలు, ఫలాధివాసాలు నిర్వహించారు. సాయంత్రం పుష్పాధిసాలు నిర్వహిస్తారు. ఆదివారం నాడు మధ్యాధివాసాలు, సాయంత్రం శయ్యాధివాసాలు నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఏడుగురు ఆదివాసులుంటారు.

also read:అయోధ్య రామ మందిరం: ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటీ?

గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ పర్యవేక్షణలో 121 మంది ఆచార్యులు పూజలు నిర్వహిస్తున్నారని ట్రస్ట్ తెలిపింది.ప్రధాన ఆచార్యుడు కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్. భారతీయ ఆధ్యాత్మికత, మతం, శాఖ ,పూజా విధానం, 150కి పైగా  సంప్రదాయాలకు చెందిన అన్ని పాఠశాలల ఆచార్యులు, మహామండలేశ్వరులు, శ్రీహంతులు,మహంతులు , నాగులతో పాటు 50 మందికి పైగా ఆదీవాసీ, గిరివాసీ ప్రముఖులున్నారు.తతవాసీ, ద్విపవాసి గిరిజన సంప్రదాయాల మేరకు ఆలయ ప్రాంగణంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.ఈ నెల  22న అయోధ్యలో ప్రధాన ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని  పలు ప్రాంతాలు, రాష్ట్రాల సంప్రదాయ సంగీత వాయిద్యాలు వాయించబడతాయి.
 

click me!