అయోధ్యలోని రామమందిరం: రామ్ లల్లా విగ్రహం బ్లాక్ స్టోన్‌తోనే ఎందుకు చేశారంటే?

By narsimha lode  |  First Published Jan 20, 2024, 4:18 PM IST


అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహం గర్బగుడిలో కొలువైంది. అయితే  ఈ విగ్రహనికి ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.


న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ మందిరంలో శ్రీ రాముడి విగ్రహం శాలిగ్రామ్ స్టోన్ తో  తయారు చేశారు. దీన్ని పవిత్ర రాయిగా భావిస్తారు. అంతేకాదు ఇది చాలా మృధువుగా ఉంటుంది.

 శాలిగ్రామ్ స్టోన్  అనేది శిలాజ అమ్మోనైట్.  హిమాలయాల్లోని పవిత్ర నదుల్లో ముఖ్యంగా నేపాల్ లోని గండకి నదిలో ఈ రాయి కన్పిస్తుంది. హిందూ మతంలోని ప్రధాన దేవతల్లో ఒకరైన విష్ణువుకు ప్రాతినిథ్యంగా దీన్ని పరిగణిస్తారు. 

Latest Videos

also read:అయోధ్య రామ మందిరం: ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటీ?

హిందూ పురాణాల్లో రాక్షస రాజు హయగ్రీవుడిని ఓడించడానికి విష్ణువు శాలిగ్రామ రాయిని తీసుకున్నాడని చెబుతున్నారు.  అప్పటి నుండి ఈ రాయిని విష్ణువు శక్తికి చిహ్నంగా పూజిస్తారు.  ఇది దైవిక లక్షణాలను కలిగి ఉంటుందని భావిస్తారు.

also read:అయోధ్యలో రామ మందిరం: రామ్ లల్లా విగ్రహం 51 ఇంచులే ఎందుకు?

అయోధ్యలోని రామ మందిరం  శాలిగ్రామ్ స్టోన్ తో నిర్మిస్తున్నారు.  అయితే  విష్ణువు  అవతారాలలో శ్రీరాముడి అవతారం కూడ ఒక్కటి.  అయితే  శ్రీరాముడి జ్ఞాపకార్థం నిర్మిస్తున్న శ్రీమహావిష్ణువును సూచించే శాలిగ్రామ్ రాయిని ఉపయోగించడం వల్ల ఆలయానికి దేవతతో ఉన్న అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు.పవిత్రమైన రాళ్లతో దేవాలయాలను నిర్మించడం హిందూ సంప్రదాయానికి ఆమోదం. అందుకే  ఈ శాలిగ్రామ్ రాయి ఈ విగ్రహం కోసం ఉపయోగించారు. 

అయోధ్యలో  రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం  ఈ నెల  22న జరగనుంది. రామ మందిరంలోని గర్బగుడిలో  బాల రాముడి విగ్రహ ప్రతిష్ట ఈ నెల  19న జరిగింది. ఈ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన  కార్యక్రమాలు సాగుతున్నాయి. 


 

click me!