PM Modi: ప్రధాని మోడీకి 14 దేశాల అత్యున్నత గౌరవ పురస్కారాలు.. సగం ముస్లిం దేశాల నుంచే

By Mahesh K  |  First Published Dec 14, 2023, 9:10 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 14 దేశాలు అత్యున్నత గౌరవ పురస్కారాలను ప్రదానం చేశాయి. అందులో సగం మేరకు ముస్లిం దేశాలే ఉన్నాయి. వీటితోపాటు ఐరాస కూడా అత్యున్నత పురస్కారాన్ని 2018లో ప్రధాని మోడీకి ప్రకటించింది.
 


PM Modi: నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే.. 2019లోనూ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో సారిగా పీఎం సీటు కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన 2014లో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆదరణ పెరుగుతూనే ఉన్నది. దేశంలోపలా.. వెలుపలా నలు దిశల ఆయన ప్రతిష్ట పెరుగుతూ వస్తున్నది. 2014లో ఆయన పీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 14 దేశాలు వాటి అత్యున్నత గౌరవ పురస్కారాలతో ప్రధాని మోడీని సత్కరించాయి. ఇందులో సగం ముస్లిం దేశాలే ఉన్నాయి. వీటితోపాటు ఐరాస కూడా ఆ సంస్థ ఉన్నత పురస్కారాన్ని నరేంద్ర మోడీకి ప్రదానం చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మురళీధరన్ పార్లమెంటులో వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1. సౌదీ అరేబియా దేశం 2016లో సాశ్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అలీజ్ అవార్డు
2. అఫ్ఘనిస్తాన 2016లో స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజి అమిర్ అమనుల్లా ఖాన్ అవార్డు
3. పాలస్తీనియా 2018లో గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలెస్టైన్ అవార్డు
4. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019లో ఆర్డర్ ఆఫ్ జయద్ అవార్డు
5. రష్యా 2019లో ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు
6. మల్దీవ్స్ 2019లో ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ ఇజుద్దీన్ అవార్డు
7. బహ్రెయిన్ 2019లో కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినాయసెన్స్ అవార్డు
8. యూఎస్ఏ 2019లో లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డు
9. భూటాన్ 2020లో ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్ కింగ్ అవార్డు
10. ఫిజి 2021లో ఆర్డర్ ఆఫ్ ఫిజి అవార్డు
11. పపువా న్యూ గినియా 2023లో ఆర్డర్ ఆఫ్ లోగోహౌ అవార్డు
12. ఈజిప్టు 2023లో ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డు
13. ఫ్రాన్స్ 2023లో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ అవార్డు
14. గ్రీస్ 2023లో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు

Latest Videos

Also Read: Yearender2023: ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎన్ని గెలిచింది?

ప్రధానమంత్రి మోడీ ద్వైపాక్షికంగానే కాదు.. అంతర్జాతీయ స్థాయిల్లోనూ రాజనీతిజ్ఞుడని ఈ అవార్డులు వెల్లడిస్తున్నాయని కేంద్రమంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ 14 అవార్డులతోపాటు ఐరాస 2018లో చాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ప్రకటించింది.

click me!