అటవీ అందాలను ఆస్వాదించా: బండీపూర్ టైగర్ రిజర్వ్‌‌ను సందర్శించిన మోడీ

Published : Apr 09, 2023, 10:16 AM ISTUpdated : Apr 09, 2023, 01:28 PM IST
 అటవీ అందాలను  ఆస్వాదించా: బండీపూర్ టైగర్ రిజర్వ్‌‌ను సందర్శించిన మోడీ

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని బండీపూర్  టైగర్ రిజర్వ్  కు  ప్రధాని నరేంద్ర మోడీ  ఆదివారంనాడు  చేరుకున్నారు.


బెంగుళూరు: ప్రధాన మంత్రి  నరేంద్రమోడీ కర్ణాటక  రాష్ట్రంలోని  బండీపూర్  టైగర్ రిజర్వ్   కు ఆదివారంనాడు  ఉదయం చేరుకున్నారు.  బండీపూర్  టైగర్ ను సందర్శించిన  తొలి  ప్రధానిగా  నరేంద్ర మోడీ  చరిత్ర సృష్టించారు.  ఖాకీ ప్యాంట్ , టీ షర్ట్,  స్లీవ్ లెస్ జాకెట్ ధరించాడు మోడీ.  

బండీపూర్  టైగర్ రిజర్వ్  లో గడిపిన  విషయమై  మోడీ ట్విట్టర్ వేదికగా  తన అనుభవాలు  పంచుకున్నారు.  బండీపూర్  టైగర్ రిజర్వ్ లో  గడపడం   మంచి అనుభూతిని  ఇచ్చిందని  మోడీ  పేర్కొన్నారు.  20 కి.మీ  రిజర్వ్ లో  పర్యటించి ప్రకృతిని ఆస్వాదించినట్టుగా  ఆయన  గుర్తు  చేసుకున్నారు. రిజర్వ్ లో  గడిపిన  ఫోటోలను  ట్విట్టర్ లో మోడీ  పంచుకున్నారు. 
 

 

 


 అస్కార్ అవార్డు  పొందిన డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్  విస్పరర్  చిత్రీకరించిన  తమిళనాడులోని  ముదుమలై  టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని  తెప్పకాడు  ఎలిఫెంట్ క్యాంప్ ను కూడా మోడీ ఇవాళ  సందర్శించనున్నారు. ఈ డాక్యుమెంటరీ  లో నటించిన  బొమ్మన్, వల్లితో  పాటు రఘు అనే ఏనుగును కూడా మోడీ  కలవనున్నారు.

 

మైసూర్ లో  నిర్వహించే  అమృత్  కాల్ సందర్భంగా  పులుల సంరక్షణ కోసం  కేంద్రం తీసుకున్న  చర్యల గురించి  మోడీ వివరించనున్నారు. అంతేకాదు  ఐబీసీఏ ను కూడా  మోడీ ప్రారంభిస్తారు.   టైగర్  ప్రాజెక్టు  50 ఏళ్లు పూర్తైన  సందర్భంగా  స్మారక నాణెన్ని  కూడా మోడీ విడుదల  చేయనున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?