
2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి నాలుకను కోస్తానని తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఓ కాంగ్రెస్ నేత మణికందన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. న్యాయమూర్తిపై బెదిరింపులకు పాల్పడిన ఆయనపై ఆ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన దిండిగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ప్రాజెక్టు టైగర్ కు నేటితో 50 ఏళ్లు.. కొత్త లుక్ లో ప్రధాని.. పులుల డేటా విడుదల చేయనున్న మోడీ..
కాంగ్రెస్ నేత మణికందన్ వ్యాఖ్యలపై ఐపీసీ 153బీ సహా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపినట్టు ‘జీ న్యూస్’ నివేదించింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 6న తమిళనాడులోని దిండిగల్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో మణికందన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ అధికారంలోకి రాగానే తమ నాయకుడు రాహుల్ గాంధీని జైలుకు పంపేలా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి నాలుక కోస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాన్ని రేకెత్తించాయి. 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేల్చడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.
బీజేపీలో చేరిన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సీ.రాజగోపాలాచారి మనవడు కేశవన్..
2019 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన ‘మోడీ’ అనే ఇంటిపేరును ఉపయోగించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ కేసు నమోదైంది. ఆ ఏడాది ఏప్రిల్ లో కర్ణాటకలోని కోలార్లో జరిగిన ర్యాలీలో ‘‘దొంగలందరికీ మోడీని ఉమ్మడి ఇంటిపేరుగా ఎలా కలిగి ఉంటారు?’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ కేసులోనే ఆయన దోషిగా తేలారు.
దీంతో 2013లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మార్చి 24న రాహుల్ ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించారు. ఈ తీర్పు ప్రకారం ఏ ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా నేరం రుజువైతే ఆటోమేటిగ్గా అనర్హత వేటు పడుతుంది. ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని మార్చి 27న లోక్ సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 24 వరకు ఆయన బంగ్లా ఖాళీ చేయాలని అందులో పేర్కొంది.
ఈ నోటీసులకు రాహుల్ గాంధీ స్పందించారు. మార్చి 28న లోక్‌సభ సెక్రటేరియట్‌లోని ఎంఎస్ బ్రాంచ్ డిప్యూటీ సెక్రటరీకి లేఖ రాశారు. ఈ బంగ్లాతో తనకు ఎన్నో సంతోషకరమైన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. ‘‘గత నాలుగు పర్యాయాలుగా లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యాను. దీంతో ఇక్కడ నాకు ఆనందకరమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నా హక్కులకు భంగం కలగకుండా, మీ లేఖలోని వివరాలకు కట్టుబడి ఉంటాను’’ అని ఆయన పేర్కొన్నారు.