Rahul Gandhi: దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతున్నా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం దానిపై నోరు విప్పకుండా.. వారణాసిలోని గంగానదిలో మాత్రం మునుగుతారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం దేదని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi: పెద్ద నొట్ల రద్దు, జీఎస్‌టీని సరైన విధంగా అమలు చేయకపోవడం, కరోనా మహమ్మారి సంక్షోభాన్ని సరిగ్గా నిర్వహించకపోవడం కారణంగా దేశంలో పరిస్థితులు దారుణంగా మారాయనీ, దీనికి ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వం అలసత్వం, వైఫల్య పాలన కారణంగా దేశంలో నేడు నిరుద్యోగం తాండవిస్తున్నదనీ, పేదల కష్టాలు మరింతగా పెరిగాయని మోడీ సర్కారుపై తీత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గమైన అమేథీ శనివారం నాడు రాహుల్ గాంధీ పర్యటించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఇరువురు పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎత్తి చూపారు. తనదైన శైలీలో ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.
Also Read: TS: విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత .. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
undefined
ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలు, పేదలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధానాన్ని తప్పుగా అమలు చేయడం, కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రజలక ప్రభుత్వం మొండి చేయి చూపడం, నిర్లక్ష్యపు నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా దేశ పరిస్థితులు దారుణంగా మారాయని అన్నారు. ప్రభుత్వ తీసుకున్న అనాలోచి నిర్ణయాలతో పేద, మధ్య తరగతి ప్రజల బతుకులు దారుణంగా మారాయని ఆరోపించారు. మొత్తం ప్రభుత్వం నిర్లక్ష్య, వైఫల్య నిర్ణయాల కారణంగా దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిపోయిందన్నారు. అనేక మంది ప్రజలకు ఉపాధి కరువైందనన్నారు. దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తున్నా, ప్రధాని మోడీ మాత్రం దానిపై ఒక్క మాట కూడా మాట్లడటం లేదు కానీ, ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న గంగానదిలో మాత్రం మునుగుతారని సెటైర్లు వేశారు.
Also Read: up assembly elections 2022: ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం: అఖిలేష్ యాదవ్
బీజేపీ హిందుత్వవాద సిద్ధాంతాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. హిందుత్వవాదుల వల్లే దేశంలో కష్టాలున్నాయని మండిపడ్డారు. హిందువులు, హిందూవాదుల మధ్యే యుద్ధం నడుస్తోందని పునరుద్ఘాటించారు. హిందువులు సత్యాన్ని నమ్ముకుంటే, హిందూవాదులు మాత్రం అధికారాన్నే పరమావధిగా భావిస్తారని బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. అలాగే, భారత్-చైనా అంశాల గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తున్నప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం చడిచప్పుడు చేయకుండా ఏం మాట్లాడకుండా ఉంటున్నారని విమర్శించారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలు ప్రజల మేలు కోసమే తీసుకువస్తున్నామని ప్రధాని మోడీ నమ్మించారు. అయితే, ప్రజా వ్యతిరేకత కారణంగా.. ప్రజలను క్షమాపణలు కోరుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఇదిలావుండగా, దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన అమేథీలో పర్యటించడం గమనార్హం.
Also Read: బూటకపు ఎన్‌కౌంటర్లకు ఆస్కారం లేదు.. AFSPAపై NHRC ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు