రోహిణి కోర్టులో పేలుడు కేసులో డీఆర్‌డీవో సైంటిస్టు అరెస్టు.. ‘ఆ లాయర్‌ను చంపాలనుకున్నా..’

Published : Dec 18, 2021, 03:40 PM IST
రోహిణి కోర్టులో పేలుడు కేసులో డీఆర్‌డీవో సైంటిస్టు అరెస్టు.. ‘ఆ లాయర్‌ను చంపాలనుకున్నా..’

సారాంశం

ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టు ఈ నెల 9వ తేదీ ఉదయం తేలికపాటి పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. ఈ పేలుడు పదార్థాన్ని అమర్చింది.. దాన్ని తయారు చేసింది... ఓ డీఆర్‌డీవో సైంటిస్టు అని పోలీసులు తెలిపారు. ఓ న్యాయవాదిని చంపాలనే లక్ష్యంతో ఆ పేలుడు పదార్థాన్ని అమర్చినట్టు దర్యాప్తులో అంగీకరించినట్టు పోలీసులు వివరించారు.  

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోహిణి జిల్లా కోర్టు(Rohini District Court)లో పేలుడు(Blast) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇందులో తీవ్రవాదుల కోణం ఏమైనా ఉన్నదా? అనే కోణంలో చర్చలు జరిగాయి. ఏకంగా న్యాయస్థానంలో పేలుడు జరగడం చర్చనీయాంశమైంది. ఈ పేలుడు కేసులో తాజాగా కీలక మలుపు ఎదురైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్త ఒకరి ప్రమేయం ఉన్నదని పోలీసుల దర్యాప్తులో తేలింది. స్వయంగా ఆ DRDO సైంటిస్టే(Scientist) తన నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఓ న్యాయవాదిని చంపే లక్ష్యంతో ఆ బాంబును అమర్చినట్టు వివరించారు. ఆయనే స్వయంగా ఆ బాంబును రూపొందించినట్టూ చెప్పడం గమనార్హం.

ఓ కేసులో వాదించడానికి రోహిణి జిల్లా కోర్టులో హాజరై ఒక న్యాయవాదిని హతమార్చాలనే లక్ష్యంతో ఓ డీఆర్‌డీవో సైంటిస్టు పథకం పన్నినట్టు దర్యాప్తులో వెలుగుచూసినట్టు సమాచారం. ఆ న్యాయవాదితో ఈ సైంటిస్టుకు ఓ ప్రాపర్టీ విషయమై వ్యక్తిగత వైరం ఉన్నట్టు తెలిసింది. అందుకే ఆ న్యాయవాదిని కోర్టులో అంతమొందించాలని ఆ సైంటిస్టు ప్లాన్ వేసినట్టు సమాచారం. అందుకే స్వయంగా ఆయనే ఓ బాంబును తయారు చేశాడు. ఆ టిఫిన్ బాంబ్‌ను కోర్ట్‌రూమ్ నెంబర్ 102లో ఉంచినట్టు పోలీసులు వివరించారు. ఆ న్యాయవాదిని చంపాలనే లక్ష్యంతోనే కోర్టులో బాంబును పెట్టినట్టు దర్యాప్తులో ఆ సైంటిస్టు అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు.

Also Read: న్యూఢిల్లీ కోర్టు ఆవరణలో కాల్పులు: గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి సహా నలుగురు మృతి

ఇప్పటి వరకు ఈ కేసులో డీఆర్‌డీవో సైంటిస్టు ఒకరి పేరు మాత్రం ముందుకు వచ్చింది. సుమారు 88 సీసీటీవీల ఫుటేజీని పరిశీలించి ఈ సైంటిస్టును విచారించారు. కోర్టులో పేలుడుకు కొన్ని నిమిషాల ముందే ఆ గది నుంచి ఆయన బయటకు వస్తున్నట్టు సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించింది. ఈ పేలుడు సంభవించగానే తీవ్రవాదుల కోణంలో ఆందోళనలు వెలువడ్డాయి. కానీ, తాజాగా, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ పేలుడులో టెర్రరిస్టుల కోణం లేదని స్పష్టం చేశారు.

ఈ నెల 9వ తేదీన రోహిణి జిల్లా కోర్టులో పేలుడు సంభవించింది. ఇందులో లక్షిత న్యాయవాది గాని ఇతరులకు గానీ ప్రాణ హానీ కలుగలేదు. అయితే, కొందరికి గాయాలైనట్టు తెలిసింది. రోహిణి కోర్టులో పేలుడు సంభవించినట్టుగా అగ్నిమాపక శాఖకు ఉదయం 10. 40 గంటలకు సమాచారం అందింది. దీంతో ఏడు అగ్నిమాపక యంత్రాలు కూడా ఘటన  స్థలానికి చేరుకున్నాయి.

Also Read: Rohini Court: ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు కలకలం.. బయటకు పరుగులు తీసిన లాయర్లు

ఇదే ఢిల్లీ రోహిణి కోర్టు( Delhi Rohini court) ఏరియాలో సెప్టెంబర్‌లో కాల్పులు జరిగాయి. అందులో గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి  (jitender gogi)సహా మరో నలుగురు మరణించారు. గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగి ని కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో  కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఢిల్లీ కోర్టులోని రూమ్ నెంబర్ 207లో కాల్పులు చోటు చేసుకొన్నాయి. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన కొందరు  దుండగులు నిందితులు జితేందర్ పై కాల్పులు జరిపారు. ఓ కేసు విషయంలో ఢిల్లీ కోర్టుకు వచ్చిన జితేందర్‌పై  ప్రత్యర్ధులు కాల్పులు జరిపారు. జితేందర్  అనుచరులు కూడ ప్రత్యర్ధులపై కాల్పులకు దిగారు.  ఈ ఘటనలో  ప్రత్యర్ధులు ఇద్దరు కూడ మరణించారు. ఈ ఘటనలో జితేందర్ న్యాయవాది కూడ గాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్