2013 పాట్నా వరుస పేలుళ్ల కేసులో 10 మంది నిందితుల్లో 9 మందిని ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు దోషులుగా నిర్దారించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఒక నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
2013 పాట్నా వరుస పేలుళ్ల (Patna serial blasts) కేసులో 10 మంది నిందితుల్లో 9 మందిని ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు దోషులుగా నిర్దారించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఒక నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ.. అక్టోబర్ 27వ తేదీన పాట్నాలోని గాంధీ మైదాన్‌లో హుంకార్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ప్రారంభానికి ముందే ఆ ప్రాంతం బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. ఈ పేలుళ్లలో ఆరుగురు మృతిచెందారు. 90 మందికి పైగా గాయపడ్డారు.
ర్యాలీ వేదిక చుట్టూ ఆరు పేలుళ్లు జరగగా.. ప్రధాన వేదిక నుంచి 150 మీటర్ల దూరంలోనే రెండు బాంబులు పేలాయి. Narendra Modi, బీజేపీ అగ్రనేతలు వేదికపైకి రావడానికి 20 నిమిషాల ముందు చివరి బాంబు పేలింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 12.25 గంటలు. ర్యాలీ వేదిక సమీపంలో నాలుగు బాంబులను గుర్తించారు. అయితే గాంధీ మైదాన్‌లో పేలుళ్లకు కొన్ని గంటల ముందు, పాట్నా రైల్వే స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన టాయిలెట్‌లో నాటు బాంబు పేలింది.
undefined
Also read: టీటీడీ బోర్డులో నేర చరిత్ర ఉన్న వారిని నియమించడంపై హైకోర్టు సీరియస్.. వారికి నోటీసులు..
ఇక, పేలుళ్లతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలతో పరుగులు తీశారు. గాయపడ్డ వారిని చుట్టుపక్కల వారే వెంటనే ఆస్పత్రికి తరలించారు. పేలుళ్లు జరిగిన కొద్ది సేపటికి సభా ప్రాంగణానికి వచ్చిన మోడీ సభను కొనసాగించారు. అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోకుండా మోదీ, ఇతర బీజేపీ నేతలు ర్యాలీని ముందుకు తీసుకెళ్లారు.
2013 నవంబర్ 6వ తేదీన జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసు విచారణ చేపట్టింది. 2014 ఆగస్టులో 11 మంది నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తొమ్మిది మంది ఇండియన్ ముజాహిదీన్ (IM) అనుమానితులను, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా చెందిన ఒకరిని ఈ కేసులో నిందితులుగా చేర్చింది. మోదీ పాట్నా సభకు ముందు న్యూఢిల్లీ, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్‌లో మోదీని టార్గెట్ చేసిన ప్లాన్స్ విఫలమవ్వడంతో.. నిందితులు పాట్నా పేలుళ్లకు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
అయితే బీహార్ పోలీసులు దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొనలేదు.. అయితే అప్పటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభయానంద్ పేలుళ్లకు IED, టైమర్ల వినియోగించినట్టుగా ధ్రువీకరించారు. పేలుళ్లలో అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లు, టైమర్ పరికరం ఉపయోగించినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు సంకేతాలు ఇచ్చాయి.