కెనడాలో భారత సంతతి మహిళ ఘనత.. రక్షణ మంత్రిగా అనితా ఆనంద్

By telugu teamFirst Published Oct 27, 2021, 1:37 PM IST
Highlights

భారత సంతతి మహిళ మరో ఘనతను సాధించారు. కెనడా రక్షణ శాఖ మంత్రిగా అనితా ఆనందర్ ఎంపికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో 46శాతం ఓట్లతో గెలుపొందిన అనితా ఆనంద్‌ను డిఫెన్స్ మినిస్టర్‌గా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎంపిక చేశారు. ఇంతకు ముందూ కెనడా రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతి హర్జిత్ సజ్జన్ ఉన్నారు.
 

న్యూఢిల్లీ: Indian Origin మహిళా అనితా ఆనంద్ కెనడాలో కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ రక్షణ శాఖ మంత్రిగా ఆమె నియామకమయ్యారు. Defence ministryలో సంస్కరణలు రావాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి Justin Trudeau ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ దేశ రక్షణ మంత్రిగా భారత సంతతి హర్జిత్ సజ్జన్ ఉన్నారు. అయితే, కొంతకాలంగా మిలిటరీలో లైంగికవేధింపులు ఘటనలు అధికమవుతున్నాయి. దీనిపై దర్యాప్తులో హర్జిత్ సజ్జన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరించారు. ఈ మార్పులో Anita Anandకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. రక్షణ శాఖను అనితా ఆనంద్‌కే ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపించింది.

Anita Anand becomes Minister of National Defence pic.twitter.com/IIRwqWAJkB

— Sean Previl (@SeanPrevil)

కెనడా డిఫెన్స్ మినిస్టర్‌గా హర్జిత్ సజ్జన్ దీర్ఘకాలం సేవలందించారు. కానీ, ఆయన సారథ్యంలో మిలిటరీలో లైంగిక వేధింపుల కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో మిలిటరీలో లింగపరమైన పురోగతి రావాలని, దాని సంస్కృతినీ ప్రక్షాళనం చేయాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ తరుణంలోనే  ఆ శాఖను అనిత్ ఆనంద్‌కే ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. తద్వారా లైంగిక వేధింపుల బాధితులకు బలమైన సందేశాన్ని పంపినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Also Read: న్యూజిలాండ్ లో ఎంపీగా భారతీయ వైద్యుడు, సంస్కృతంలో ప్రమాణస్వీకారం

కార్పొరేట్ లాయర్‌గా అనితా ఆనంద్‌కు విశేష అనుభవమున్నది. కార్పొరేట్ గవర్నెన్స్‌లో కృషి చేశారు. బిజినెస్ ఆపరేషన్స్‌కు సంబంధించి ఆమెకు చట్టాలపై మంచి పట్టు ఉన్నది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆమె 46శాతం ఓట్లతో ఓక్‌విల్లే నుంచి విజయం సాధించారు. 2019లో ఇక్కడి నుంచే రూకీ పార్లమెంట్ మెంబర్‌గా గెలుపొందారు. కరోనా సంక్షోభ సమయంలో ఆమె ప్రొక్యూర్‌మెంట్ మినిస్టర్‌గా సేవలందించారు. వ్యాక్సిన్ పంపిణీలో ఆమె విశేషంగా కృషి చేశారు.

హర్జిత్ సజ్జన్‌ను ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మంత్రిగా ట్రూడో నియమించారు. అనితా ఆనంద్‌ను క్యాబినెట్‌లోకి చేర్చి లింగ సమానత్వాన్ని పాటించారు. తాజా మార్పుతో Canada క్యాబినెట్‌లో ఒక సంఖ్య పెరిగి 38 మందికి సభ్యులు చేరారు.

click me!