బెంగాల్‌లో కొత్త చరిత్ర సృష్టిస్తాం: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో జేపీ నడ్డా

By narsimha lodeFirst Published Nov 7, 2021, 2:18 PM IST
Highlights

 బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం నాడు  ప్రారంభమైంది.ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. 

 న్యూఢిల్లీ: Bjp national executive meeting ఆదివారం నాడు ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో పాటు వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల గురించి ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.

ఈ సమావేశానికి 124 మంది నేతలు హాజరయ్యారు. మిగిలిన నేతలంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.పార్టీకి చెందిన అగ్రనేతలు మురళీమనోహర్ జోషి, LK Advani లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

also read:ఆ వీడియోలు నా దగ్గరున్నాయి.. ఇక ఆట మొదలైంది కేసీఆర్ : ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Corona సమయంలో కూడా ఆర్ధిక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రధాని Narendra Modi తీసుకొన్న నిర్ణయాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సందర్భంగా ప్రశంసించారు. కరోనా ను అదుపు చేసేందుకు  లాక్‌డౌన్ విధించడంతో పాటు లాక్‌డౌన్  తర్వాత మూడు మాసాల పాటు దేశంలోని ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా మహమ్మారి నుండి దేశాన్ని రక్షించేందుకు మోడీ  దేశాన్ని ముందుండి నడిపారన్నారు.

బెుంగాల్ ప్రభుత్వం, TMC గుండాల దాడిలో అనేక మంది బీజేపీ కార్యకర్తలు మరణించారన్నారు. బెంగాల్ ప్రజల తరపున బీజేపీ నిలుస్తోందన్నారు. టీఎంసీ ప్రజా వ్యతిరేక పాలనకు తాము అండగా నిలుస్తామన్నారు.బెంగాల్ ప్రభుత్వం కరోనా టీకా విషయంలో వివక్ష చూపిందని ఆయన విమర్శించారు.

పార్టీని బూత్ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా కోరారు. ప్రతి సర్వేలోనూ బీజేపీ ఓట్ల శాతం పెరిగిన విషయాన్ని నడ్డా గుర్తు చేశారు. సాధారణ ఎన్నికల నుండి పంచాయితీ ఎన్నికల వరకు ఓట్ల శాతం పెరిగిందన్నారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ అద్భుతమైన పనితీరును కనబర్చిందన్నారు.బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అత్యంత వేగంగా అభివృద్ది చెందిందని ఆయన గుర్తు చేశారు.

2014లో కేంద్రంలో  బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు బడ్జెట్ లో రూ1. 23 లక్షల కోట్లను కేటాయించిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. ప్రధాని మోడీ తీసుకొన్న నిర్ణయాల కారణంగా ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.దేశంలో 100 కోట్లకు కరోనా   వ్యాక్సిన్ తీసుకొన్నారని  మంత్రి చెప్పారు.

కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలో బీజేపీ విస్తరించాలని ఆయన చెప్పారు. తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ ఫలితాలు తెలంగాణలో బీజేపీని ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు.


దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి సుమారు 342 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.ఈ సమావేశంలో ఇవాళ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.  ఇటీవల జరిగిన 29 అసెంబ్లీ , మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. .

click me!