పాక్ విజయాన్ని వేడుక చేసుకున్నారని భార్యపైనే భర్త ఫిర్యాదు.. కేసు నమోదు

By telugu teamFirst Published Nov 7, 2021, 1:34 PM IST
Highlights

టీ20 వరల్డ్ కప్ సిరీస్‌లో భారత క్రికెట్ టీంపై పాకిస్తాన్ క్రికెట్ టీం విజయ సాధించిన మ్యాచ్ ఇప్పటికీ దేశంలో కలకలం రేపుతున్నది. పాక్ విజయాన్ని వేడుక చేసుకున్న కొందరిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా భార్య, ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన భార్య, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.
 

రాంపూర్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అక్టోబర్ 24న జరిగిన T20 World Cup Matchలో Pakistan విజయం సాధించింది. India ఓటమిపై చాలా మంది భారతీయులు బాధపడ్డారు. కానీ, కొందరు మాత్రం పాకిస్తాన్ విజయాన్ని వేడుక చేసుకున్నారు. పాకిస్తాన్ విజయంపై సంబురాలు(Celebrations) జరుపుకోవడానికి చాలా మంది అభ్యంతరపెట్టారు. జమ్ము కశ్మీర్, ఆగ్రా, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో పాకిస్తాన్ విజయాన్ని వేడుక చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై కేసులూ నమోదయ్యాయి. తాజాగా, Uttar Pradesh కట్టుకున్న Wifeపైనే Husband ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. భార్యతోపాటు అత్తగారింటి వారందరి పై ఫిర్యాదు చేశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లా అజీమ్ నగర్‌కు చెందిన ఇషాన్ మియా తన భార్య రబియా షాంసిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రబియా కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత క్రికెట్ టీమ్‌పై పాకిస్తాన్ క్రికెట్ టీమ్ విజయాన్ని రబియా షాంసి, ఆమె కుటుంబ సభ్యులు వేడుక చేసుకున్నట్టు ఇసాన్ మియా రాంపూర్‌లోని గంజ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు, పాకిస్తాన్ విజయాన్ని స్తుతిస్తూ వాట్సాప్ స్టేటస్‌లు పెట్టారని అందులో పేర్కొన్నారు.

కొందరు ఇండియా క్రికెట్ టీమ్‌‌ను హేళన చేశారనే ఘటన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ అకింత్ మిట్టల్ వివరించారు.

Also Read: పాక్ విజయాన్ని వేడుక చేసుకున్నవారిపై ‘దేశద్రోహం’ కేసు.. సీఎం వార్నింగ్

ఇషాన్ మియా, రబియా షాంసిలు పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. రబియా షాంసి ఆమె కుటుంబ సభ్యులతోనే ఉంటున్నారు. అంతేకాదు, భర్తపై వరకట్నం వేధింపుల కేసు పెట్టినట్టు ఎఫ్ఐఆర్‌ వివరిస్తున్నది.

ఇషాన్ మియా ఫిర్యాదుతో ఐపీసీలోని సెక్షన్ 153ఏ, ఐటీ యాక్ట్ 2008లోని సెక్షన్ 67ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

వరల్డ్ కప్ టీ20 మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయాన్ని వేడుక చేసుకున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. శ్రీనగర్‌లో కశ్మీరీ ఎంబీబీఎస్ స్టూడెంట్ల వేడుకల వీడియో వైరల్ అయింది. ఆగ్రాలో ఇంజినీరింగ్ చదువుకుంటున్న ముగ్గురు కశ్మీరీ విద్యార్థులనూ అరెస్టు చేశారు. జమ్ము కశ్మీర్‌లో గుర్తు తెలియని కొందరిపై ఉపా కింద కేసులు నమోదయ్యాయి.

Also Read: IND vs PAK: పాక్ విజ‌యంపై సంబురాలు.. యూపీలో ముగ్గురు కాశ్మీరీ విద్యార్థులు అరెస్ట్

పాకిస్తాన్ విజయాన్ని వేడుక చేసుకుంటే కేసులు పెడతారా? అంటూ జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆగ్రహించారు. అందులో తప్పేముందని వాదించారు. అంతేకాదు, పాకిస్తాన్ జట్టును అభినందించిన తొలి వ్యక్తి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అని పేర్కొన్నారు. ఆయన తీరును మెచ్చుకున్నారు. అనంతరం ఈ కేసుల్లో అరెస్టయిన విద్యార్థులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, పాకిస్తాన్ విజయంపై సంబురాలు చేసుకుంటే దేశద్రోహం కింద కేసు నమోదు  చేస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్‌లో నివసిస్తూ పాకిస్తాన్ విజయాన్ని వేడుక చేసుకోవడాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. 

click me!