ఢిల్లీలో పేలుళ్ల కుట్ర భగ్నం: పాక్ ఉగ్రవాది అరెస్ట్

By narsimha lodeFirst Published Oct 12, 2021, 10:41 AM IST
Highlights

ఢిల్లీలో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడు పాకిస్తాన్ రాష్ట్రంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ అస్రఫ్ గా పోలీసులు గుర్తించారు.నకిలీ గుర్తింపు కార్డుతో నిందితుడు ఢిల్లీలో నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.

న్యూఢిల్లీ:pakistanకు చెందిన  terroristను ఢిల్లీ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి ఏకే47 సహా గ్రెనేడ్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.నిందితుడు పాకిస్తాన్‌లోని punjab కు చెందిన mohd asraf గా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని లక్ష్మీనగర్ నుండి పాకిస్తాన్ జాతీయుడు అస్రఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియాకు చెందిన నకిలీ గుర్తింపు కార్డులతో అస్రఫ్ ఢిల్లీలో మకాం పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు.

also read:కశ్మీర్‌లో ఐదుగురు జవాన్ల వీరమరణం.. ఉగ్రవాదులతో కొనసాగుతున్న ఎదురుకాల్పులు

అస్రఫ్ నుండి ఏకే 47 తో పాటు 60 రౌండ్ల బుల్లెట్లు, 50 రెండు ఆధునాతన తుపాకులను కూడా సీజ్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు  తెలిపారు.  నిందితుడు నివాసం ఉంటున్న లక్ష్మీనగర్ లోని ఇంట్లో పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. దసరా సందర్భంగా ఢిల్లీలో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ కమిషనర్ రాకేష్ ఆస్తానా పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. మూడు రోజుల క్రితం సమావేశఁం నిర్వహించిన సమావేశంలో అస్తానా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితుడు కుట్ర చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సోషియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.  నిషేధిత లష్కరే తోయిబా,టీఆ్రఎఫ్ కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారు. మృతుల నుండి ఆయుధాలు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.


 

click me!