పాన్ మసాలా ప్రకటన నుంచి తప్పుకున్న అమితాబ్...

By AN TeluguFirst Published Oct 12, 2021, 10:09 AM IST
Highlights

అమితాబ్ పాన్ మసాలా యాడ్ లో నటించడం మీద ఆయన అభిమానుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇవన్నీ చూశాకే amitab bachhan ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మీదట అలాంటి ప్రకటనల్లో అమితాబ్ కనిపించరంటూ ఆదివారం రాత్రి ఆయన కార్యాలయం పేర్కొంది. 

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. pan masala ప్రకటన నుంచి తప్పుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే తీసుకున్న డబ్బును వెనక్కు ఇచ్చేసినట్లు చెప్పారు. క్యాన్సర్ కారకమైన పాన్ మసాలా వినియోగాన్ని ప్రోత్సహించేలా అమితాబ్ ప్రకటనల్లో కనిపిస్తుండటంమీద విమర్శలు వచ్చాయి.

అమితాబ్ పాన్ మసాలా యాడ్ లో నటించడం మీద ఆయన అభిమానుల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇవన్నీ చూశాకే amitab bachhan ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మీదట అలాంటి ప్రకటనల్లో అమితాబ్ కనిపించరంటూ ఆదివారం రాత్రి ఆయన కార్యాలయం పేర్కొంది. పాన్ మసాలా బ్రాండింగ్ అన్నది నిషేధిత ఉత్పత్తులకు చేసే ప్రచారం కిందకు వస్తుందన్న విషయం ఆయనకు తెలియదని తెలిపింది. 

సరోగేట్ ప్రకటనను వదులకోవాలంటూ ఇటీవలే జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ కూడా అమితాబ్ కు లేఖ రాసింది. 

కాగా, సెప్టెంబర్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు National Anti-Tobacco Organisation సంచలన లేఖ రాసింది. అమితాబచ్చన్ పాన్ మసాలాను ప్రచారం చేసే ప్రకటన ప్రచారం నుంచి వైదొలగాలని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ కోరింది. 

పొగాకు, పాన్ మసాలా  వ్యసనం  పౌరుల ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తుందని  వైద్య పరిశోధనల్లో  తేలిందని,  అందువల్ల పాన్ మసాలాలను ప్రోత్సహించే  ప్రకటనల ప్రచారం నుంచి  వైదొలగాలని కోరుతూ  నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ అమితాబ్ కు లేఖ రాశారు.

అమితాబ్ కు నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ షాక్.. ఆ ప్రకటనల నుంచి వెంటనే తప్పుకోవాలంటూ...

‘‘అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్. అతను వీలైనంత త్వరగా  పాన్ మసాలా ప్రకటనల నుంచి తప్పుకోవాలి.  పొగాకు వ్యసనం నుంచి యువతదూరంగా ఉండడానికి ఈ చర్య సహాయపడుతుంది’’  అని శేఖర్ సల్కర్ కోరారు.  

పాన్ క్యాన్సర్ కారకంగా పనిచేస్తుందని ఇటీవల పరిశోధనల్లో తేలింది.  తమలపాకులోని పదార్థాలు శరీరంలో క్యాన్సర్ కారకాలుగా మారి నోటి క్యాన్సర్ కు దారితీస్తాయి అని తేలింది. ‘పాన్ మానవులకు క్యాన్సర్ కారకం అనే శాస్త్రీయ ఆధారాలను ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్,  ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థలు నిర్ధారించాయి’ అని బచ్చన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

click me!