ఆ పాకిస్తాన్ ఉగ్రవాది భారతీయ మహిళను పెళ్లాడాడు.. అసలు ఇండియాకు ఎప్పుడు వచ్చాడంటే?

By telugu teamFirst Published Oct 12, 2021, 5:23 PM IST
Highlights

ఢిల్లీలో అరెస్టయిన పాకిస్తాన్ ఉగ్రవాది 15ఏళ్ల క్రితమే మనదేశంలోకి వచ్చినట్టు తెలిసింది. అంతేకాదు, ఇక్కడికి వచ్చాక భారత మహిళనే పెళ్లి చేసుకున్నాడు. అయితే, వారిద్దరు ఇప్పుడు కలిసి లేరు. 
 

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో ఉగ్రకుట్ర జరగకుండా ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఢిల్లీలో లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న pakistan terroristను arrest చేశారు. ఏకే 47 రైఫిల్, ఒక ఎక్స్‌ట్రా మ్యాగజైన్, 60 రౌండ్ల బుల్లెట్లు, ఓ గ్రెనేడ్, 50 రైండ్ల బుల్లెట్లతోపాటు రెండు పిస్టల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌కు చెందిన మొహ్మద్ అష్రఫ్ నకిలీ ఐడీతో లక్ష్మీనగర్‌లో ఉంటున్నాడు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో అలీ అహ్మద్ పురి పేరిట నకిలీ ఐడీ పొందాడు. 15ఏళ్ల క్రితమే భారత్‌కు వచ్చినట్టు తెలిసింది.

పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐతో మొహ్మద్ అష్రఫ్ అనుసంధానంలో ఉన్నట్టు తెలుస్తున్నది. పాకిస్తాన్ నుంచి దేశంలోకి వచ్చే ఉగ్రవాదులకు ఆయన సహకరిస్తున్నాడు. ఆయుధాలు, ఇతర సదుపాయాలను ఆయన కల్పిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. యమునా నది తీరంలో ఇసుకలో ఆయన ఆయుధాలు దాచినట్టు సమాచారం. ఇక్కడ ఇండియాకు వచ్చిన అష్రఫ్ భారతీయ మహిళనే వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉండటం లేదు.

ఆయన ఢిల్లీలో మౌలానాగా నివసించాడు. ఇతర నగరాల్లోనూ పర్యటించాడు. వాయిస్ ఓవర్ ఐపీ ఆధారంగా ఫోన్‌లు మాట్లాడేవాడు. ఆయన మొబైల్ ఫోన్‌లో చాలా మంది పాకిస్తాన్ నంబర్లు ఉన్నట్టు తెలిసింది. ఢిల్లీలో ఆయనతోపాటు ఇంకొందరు నెట్‌వర్క్‌గా ఉన్నట్టు సమాచారం. త్వరలోనే వారినీ అరెస్టు చేయనున్నట్టు పోలీసువర్గాలు తెలిపాయి.

Also Read: ఢిల్లీలో పేలుళ్ల కుట్ర భగ్నం: పాక్ ఉగ్రవాది అరెస్ట్

ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ఈ నిందితుడు కుట్ర చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సోషియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.  నిషేధిత లష్కరే తోయిబా,టీఆ్రఎఫ్ కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారు. మృతుల నుండి ఆయుధాలు, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

click me!