పంపిణీ చేస్తున్న విద్యుత్ ఎంత? లెక్కలు వేయండి.. డిస్కమ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్

By telugu teamFirst Published Oct 12, 2021, 4:04 PM IST
Highlights

ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభం ముంచుకువస్తున్నదనే ఆందోళనలు వెల్లడించిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు కీలక ఆదేశాలను జారీ చేసింది. విద్యుత్ శక్తి వృథా, చోరీ, నష్టాలను నివారించడానికి విద్యుచ్ఛక్తి అకౌంటింగ్ ప్రారంభించాలని ఆదేశించింది. వీటిని ప్రతి యేటా స్వతంత్ర ఆడిటర్లు తనిఖీలు చేస్తారని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

న్యూఢిల్లీ: విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తున్నదనే వార్తలు వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శక్తి వృథాను అరికట్టడానికి కీలక నిర్ణయం తీసుకుంది. power energy నష్టాలను, వేస్టేజీని, చోరీని నివారించడానికి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై discomలు నిర్ణీత వ్యవధికి విద్యుత్ శక్తి పంపిణీకి సంబంధించిన account మెయింటెయిన్ చేయాలని తెలిపింది. ప్రతి మూడు నెలల చొప్పున విద్యుత్ లెక్కలను నమోదు చేసుకోవాలని పేర్కొంది. అంతేకాదు, ఇక నుంచి స్వతంత్ర ఎనర్జీ ఆడిటర్‌లతో ఈ అకౌంట్‌ల తనిఖీ ఉంటుందని తెలిపింది. వీటిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెండు నెలల సమయాన్నిచ్చింది.

ఆ ఆడిట్ నివేదికలను ప్రసారం చేస్తామని union government తెలిపింది. డిస్కమ్‌లు సమగ్రమైన వివరాలు నమోదు చేయాలని  పేర్కొంది. వివిధ రకాల వినియోగదారులను విభజించి కేటగిరీల వారీగా వారి విద్యుత్ వినియోగాన్ని నమోదు చేయాలని, సరఫరా, పంపిణీ నష్టాలనూ పేర్కొనాలని వివరించింది. దీంతో విద్యుత్ శక్తి నష్టాలు, చోరీని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది. సంబంధిత అధికారులకు ఆ జవాబుదారీతనాన్ని కట్టబెట్టడానికి ఉపకరిస్తుందని తెలిపింది. అంతేకాదు, డిస్కమ్‌లు నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి, అప్‌గ్రెడేషన్‌కు ఈ అకౌంటింగ్ సహకరిస్తుందని వివరించింది.

Also Read: థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత: అలా చేస్తే చర్యలు, రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్

అన్ని మార్గాల్లో, వేర్వేరు వోల్టేజీల దగ్గర విద్యుత్ శక్తి ఇన్‌ఫ్లోలను అకౌంటింగ్ నమోదు చేస్తుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ   వివరించింది. దాని వినియోగ వివరాలను సమగ్రంగా పేర్కొంటుందని తెలిపింది.

బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ముంచుకొచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న తరుణంలో మంగళవారం నాడు కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. తమ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ను అందించకుండా విద్యుత్ ను విక్రయించకూడదని  రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది.సెంట్రల్ ఆపరేటింగ్ స్టేషన్ల వద్ద 15 శాతం విద్యుత్ ఏ రాష్ట్రాలకు కూడా కేటాయించకుండా ఉంటుంది.అత్యవసర విద్యుత్ అవసరం ఉన్న రాష్ట్రాలకు కేంద్రం తన కోటా నుండి విద్యుత్ ను అందించనుంది.

మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు కేంద్రానికి ఈ సమాచారం ఇవ్వాలని కోరింది. విద్యుత్ అవసరం ఉన్న రాష్ట్రాలకు ఈ విద్యుత్ ను ఉపయోగించుకోవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.వినియోగదారులకు విద్యుత్ ఇవ్వకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని కేంద్రం హెచ్చరించింది.

click me!