సీఎం కార్యాలయంలో అగ్నిప్రమాదం.. స్పాట్‌కు మూడు అగ్నిమాపక యంత్రాలు

By telugu teamFirst Published Oct 12, 2021, 5:03 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కార్యాలయంలో ఈ రోజు ఉదయం మంటలు చెలరేగాయి. కోల్‌కతాలోని తాత్కాలిక సచివాలయం నబన్నా బిల్డింగ్‌లోని 14వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. వెంటనే అధికారులు అప్రమత్తమవడంతో నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చాయి.
 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం mamata banerjee కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ఈ రోజు 11.50 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని నబన్నా బిల్డింగ్‌లోని 14వ అంతస్తులో మంటలు రావడాన్ని అధికారులు గమనించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. కనీసం మూడు అగ్నిమాపక యంత్రాలు నబన్నాకు చేరుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తెచ్చారు.

west bengal తాత్కలిక సెక్రెటేరియట్‌గా నబన్నా బిల్డింగ్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో 14వ అంతస్తులో chief minister మమతా బెనర్జీ కార్యాలయం ఉన్నది. 14వ అంతస్తులు మంటలు రాగానే ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంటలు రావడానికి గల కారణాలను కనుగొనడానికి ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. దుర్గా పూజ సలవులు కావడంతో సచివాలయం మూసేసి ఉన్నది. దీంతో ప్రాణాపాయం తప్పింది. 

Also Read: భవానీపూర్ ఉపఎన్నిక: చేతులెత్తేసిన బీజేపీ.. భారీ మెజార్టీతో మమత విక్టరీ

నబన్నా బిల్డింగ్‌ టాప్‌లో వొడాఫోన్ నెట్‌వర్క్ సిగ్నల్ టవర్‌ ఉన్నది. ఈ టవర్‌కు చెందిన ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో తొలిసారిగా మంటలు  వచ్చినట్టు పోలీసులు గమనించారు. ఈ నేపథ్యంలోనే వొడాఫోన్ అధికారులను దర్యాప్తు చేయనున్నట్టు రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ సిగ్నల్ టవర్‌కు పీడబ్ల్యూడీ విద్యుత్‌ను అందిస్తున్నది. కాబట్టి, పీడబ్ల్యూడీ సివిల్, పీడబ్ల్యూడీ ఎలక్ట్రికల్ వింగ్ అధికారులనూ ప్రశ్నించనున్నట్టు వివరించారు.

click me!