
India Pakistan : కశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రమూలకు అత్యంత కిరాతకంగా కాల్పులు జరిపి చంపిన విషయం తెలిసిందే. అయితే ఇలా తోటి మనుషుల ప్రాణాలుతీసిన ఉగ్రవాదులను పాకిస్థాన్ స్వాతంత్య్ర సమరయోదులుగా ఈ పేర్కొంది. స్వయంగా ఆ దేశ ఉపప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ ఉగ్రవాదులకు మద్దతిచ్చేలా మాట్లాడారు.
పహల్గాంలో అమాయక పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రశంసిస్తూ వారికే మద్దతిచ్చేలా మాట్లాడారు. ఇలా పరోక్షంగా ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు ఆయన అంగీకరించారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నామంటూ అంతర్జాతీయ సమాజం ముందు నాటకాలు ఆడిన పాక్ ఇప్పుడు తమ అసలురంగు బైటపెట్టుకుంది.
ఇదిలా ఉండగా ఉగ్రవాద దాడిపై దర్యాప్తు చేయడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనంత్‌నాగ్ అదనపు ఎస్పీ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఎన్ఐఎ బృందం బైసారన్ నుండి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించి పరీక్ష కోసం పంపింది.
ఇక పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ సరిహద్దులో అలజడి రేగింది. పాకిస్తాన్ ఓ బిఎస్ఎఫ్ జవాన్ ను అదుపులోకి తీసుకుంది... ఈ జవాన్‌ను విడుదలకు చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఇంకా జవాన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటిన తర్వాత జవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దులో రైతులకు సహాయం చేయడానికి వెళ్ళిన తర్వాత ఆ సైనికుడిని పాకిస్తాన్ పట్టుకుంది. పాకిస్తాన్ సైన్యం ఆ సైనికుడి చిత్రాన్ని విడుదల చేసింది. ఫ్లాగ్ మీటింగ్‌ల ద్వారా చర్చల ద్వారా అతని విడుదలకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.