ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరంగన్ కన్నుమూత... ప్రధాని మోదీ నివాళి

Published : Apr 25, 2025, 03:42 PM ISTUpdated : Apr 25, 2025, 03:50 PM IST
ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరంగన్ కన్నుమూత... ప్రధాని మోదీ నివాళి

సారాంశం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మాజీ ఛైర్మన్, మాజీ ఎంపీ కస్తూరిరంగన్ కన్నుమూసారు. ఆయన సేవలను గుర్తుచేసుకుని నివాళి అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్ డాక్టర్ కె కస్తూరిరంగన్ బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. గురువారం ఉదయం బెంగళూరులోని ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. పార్థివ దేహాన్ని రామన్ పరిశోధనా సంస్థ (RRI)లో  సందర్శనార్థం ఉంచనున్నారు.  

జాతీయ విద్యా విధానంలో (NEP) విద్యా సంస్కరణల రూపశిల్పిగా విస్తృతంగా గుర్తింపు పొందిన కె. కస్తూరిరంగన్ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. కర్ణాటక నాలెడ్జ్ కమిషన్‌కు అధ్యక్షత వహించారు.  2003 నుండి 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా తరువాత భారత ప్రణాళికా సంఘంలో భాగంగా ఉన్నారు.

కస్తూరి రంగన్ భారతదేశంలోని అత్యంత గౌరవనీయ శాస్త్రవేత్తలు, దార్శనికుల్లో ఒకరు... ఆయన మరణంతో దేశ శాస్త్ర, విద్యా ప్రయాణంలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డాక్టర్ కస్తూరిరంగన్ మరణం బాధాకరం... ఆయన చేసిన కృషిని తరతరాలు గుర్తుంచుకుంటాయని అన్నారు.

డాక్టర్ కస్తూరిరంగన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లో పనిచేసిన కాలంలో భారతదేశ అంతరిక్ష కార్యక్రమాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు.“భారతదేశ శాస్త్ర, విద్యా ప్రయాణంలో గొప్ప వ్యక్తి అయిన డాక్టర్ కె. కస్తూరిరంగన్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన దార్శనిక నాయకత్వం, దేశానికి చేసిన నిస్వార్థ సేవ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఇస్రోకి చాలా శ్రద్ధగా సేవలందించారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. దానికి మనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాం. ఆయన నాయకత్వంలోనే ప్రతిష్టాత్మక ఉపగ్రహ ప్రయోగాలు జరిగాయి. ఆవిష్కరణలపై దృష్టి సారించారు” అని ప్రధాని మోడీ అన్నారు.

కస్తూరిరంగన్ సేవలు : 

మాజీ ఇస్రో ఛైర్మన్ కన్తూరిరంగన్  భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ లతో సత్కరించబడ్డారు. ఆయన రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ మరియు ఎన్ఐఐటి యూనివర్సిటీ రెండింటిలోనూ మాజీ ఛాన్సలర్‌గా ఉన్నారు. ఆయన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి మాజీ ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు. ఆయన కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ మాజీ ఛైర్మన్‌గా పనిచేశారు.

కస్తూరిరంగన్ 2003 నుండి 2009 వరకు రాజ్యసభ విశిష్ట సభ్యుడిగా కూడా పనిచేశారు. అదనంగా, ఆయన ఇప్పుడు రద్దు చేయబడిన భారత ప్రణాళికా సంఘంలో సభ్యుడిగా కూడా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. 2004 ఏప్రిల్ నుండి 2009 వరకు, ఆయన బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నూతన విద్యా విధాన ముసాయిదా కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు.

కస్తూరిరంగన్ బాల్యం :

కె. కస్తూరిరంగన్ 24 అక్టోబర్ 1940న అప్పటి కోచిన్ రాజ్యంలో భాగమైన ఎర్నాకులంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సి. ఎం. కృష్ణస్వామి అయ్యర్, విశాలక్ష్మి. ఆయన తల్లి వైపు కుటుంబం పాలక్కాడ్ జిల్లాలోని చిత్తూర్ తాలూకాలోని నల్లెపల్లి అగ్రహారంలో స్థిరపడింది.  అయితే ఆయన తండ్రి వంశం త్రిస్సూర్ సమీపంలోని చాలకుడి పట్టణానికి చెందినది.

కస్తూరిరంగన్ తాత అనంతనారాయణ అయ్యర్ ఎర్నాకులంలో గౌరవనీయమైన వ్యక్తి... ఆయన నిజాయితీ మరియు క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందారు. తన పాఠశాల మరియు కళాశాల విద్యను పూర్తి చేసిన తర్వాత ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్‌గా పనిచేశారు. ఆయన మరియు ఆయన భార్య నారాయణి ఐదుగురు పిల్లలను పెంచారు.. వారిలో పెద్దవారు కస్తూరిరంగన్ తల్లి విశాలక్ష్మి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌