
Pahalgam Attack: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తల మధ్య ఏప్రిల్ 24 నుంచి ఆరు రోజుల్లో 786 మంది పాకిస్థానీయులు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్ నుంచి వెళ్లిపోయారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. అదే సమయంలో 1376 మంది భారతీయులు పాకిస్థాన్ నుంచి అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చారని చెప్పారు.
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ాదాడుల వెనుక పాకిస్తాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రమూకలు ఉన్నాయని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలోనే భారత పాకిస్తాన్ పట్ల కఠిన చర్యలు తీసుకుంటోంది. దాదాపు అన్ని ఒప్పందాలను ఇరు దేశాలు రద్దు చేసుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే పాకిస్థానీయులు ఏప్రిల్ 27 నాటికి భారత్‌ను విడిచి వెళ్లాలని ఏప్రిల్ 24న ఆదేశాలు జారీ చేసింది. వైద్య వీసాలు ఉన్నవారు ఏప్రిల్ 29 వరకు వెళ్లవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దౌత్య, అధికారిక, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారికి మినహాయింపు ఇచ్చారు. 12 రకాల స్వల్పకాలిక వీసాలు కలిగిన పాకిస్థానీయుల గడువు ఆదివారం ముగిసింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత పాకిస్థానీయుల దేశంలో ఉండటంపై ఆంక్షలు విధించారు. పాకిస్థాన్‌కు ప్రయాణించవద్దని భారతీయులకు ప్రభుత్వం గట్టిగా సూచించింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా భారత్‌కు తిరిగి రావాలని కూడా సూచించింది.
"పాకిస్థాన్‌కు నేరుగా విమానాలు లేకపోవడంతో చాలామంది దుబాయ్ లేదా ఇతర మార్గాల ద్వారా విమానంలో వెళ్లిపోయారు. రాష్ట్ర పోలీసులు, ఇతర కేంద్ర సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులను గుర్తిస్తున్నందున మరిన్ని మంది పాకిస్థానీయులు దేశం విడిచి వెళ్తారని మేము భావిస్తున్నాము" అని అధికారి చెప్పారు.
కేంద్ర నిఘా సంస్థలతో సమన్వయంతో అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ధృవీకరణ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఏప్రిల్ 29 తర్వాత కూడా భారత్‌లో ఉంటే పాకిస్థానీయులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి బసను చట్టవిరుద్ధంగా పరిగణిస్తామని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న మరో అధికారి తెలిపారు.