మధ్యాహ్న భోజనం తిన్న 200 మంది విద్యార్ధులకు అస్వస్థత... బల్లి పడిన ఆహారమే కారణమా..?

By Siva KodatiFirst Published Nov 11, 2022, 4:47 PM IST
Highlights

బీహార్‌లోని భాగల్పూర్‌లో 200 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై బీహార్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. హెడ్ మాస్టర్, ఇతర సిబ్బంది తప్పు చేసినట్లుగా తేలితే  వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 

బీహార్‌లోని భాగల్పూర్‌లో 200 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. బల్లి పడినట్లుగా అనుమానిస్తోన్న ఆహారం తిని వీరంతా ఆసుపత్రి పాలైనట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, సిబ్బంది పిల్లలను ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్ధులు ట్యూషన్ ‌కు వెళ్లగా.. ఒక్కొక్కరిగా వాంతులు చేసుకున్నారు. 

ఓ విద్యార్ధి భోజనం చేసిన ప్లేట్‌లో బల్లి కనిపించినట్లుగా తెలుస్తోంది. దీనిపై విద్యార్ధులు హెడ్ మాస్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన అది బల్లి కాదని, వంకాయ అని భయపడకుండా భోజనం చేయాలని చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి. పిల్లలంతా భోజనం చేసిన కాసేపటికే అస్వస్థతకు గురయ్యారు. దీనిపై బీహార్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. హెడ్ మాస్టర్, ఇతర సిబ్బంది తప్పు చేసినట్లుగా తేలితే  వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. 

ALso Read:నారాయణఖేడ్‌లోని కస్తుర్భా బాలికల హాస్టల్ ఫుడ్ పాయిజన్.. 35 మందికి అస్వస్థత.. చర్యలు చేపట్టిన డీఈవో

ఇకపోతే.. ఇటీవల తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని కస్తుర్భా బాలికల వసతి గృహంలోనూ ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 35 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులు కొందరు వాంతులు చేసుకోగా.. మరికొందరు కడుపునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వసతి గృహం సిబ్బంది అనారోగ్యానికి గురైన విద్యార్థులను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అక్కడ ప్రస్తుతం విద్యార్థులు చికిత్స కొనసాగుతుంది. టిఫిన్‌గా పెట్టిన అటుకుల ఉప్మాలో పురుగులు వచ్చినట్టుగా విద్యార్థినిలు తెలిపారు. 

అయితే విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇక, ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి, వసతి  గృహానికి వచ్చి వారి పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అయితే కొందరు విద్యార్థినులను వారి కుటుంబ సభ్యులు హాస్టల్ నుంచి తీసుకెళ్లిపోతున్నారు. పురుగుల తిండి తినలేక ఇంటికి వెళిపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది పట్టించుకోవడం లేదని  చెప్పారు. 

click me!