'హర్ హర్ మహాదేవ్'ప్రదర్శన నిలిపివేత.. మహారాష్ట్ర ఎన్‌సిపి ఎమ్మెల్యే అరెస్ట్

Published : Nov 11, 2022, 04:01 PM IST
'హర్ హర్ మహాదేవ్'ప్రదర్శన నిలిపివేత.. మహారాష్ట్ర ఎన్‌సిపి ఎమ్మెల్యే అరెస్ట్

సారాంశం

మరాఠీ సినిమా 'హర్ హర్ మహాదేవ్' ప్రదర్శనకు అంతరాయం కలిగించినందుకు మహారాష్ట్ర ఎన్‌సిపి ఎమ్మెల్యే జితేంద్ర అవద్ ను అరెస్ట్ చేశారు. రాజకీయంగా హైప్ క్రియేట్ చేసేందుకు ఛత్రపతి శివాజీ చరిత్రను వక్రీకరించి చిత్రీకరించారని ఎన్సీపీ ఎమ్మెల్యే ఆరోపించారు.  

మహారాష్ట్ర ఎన్‌సిపి ఎమ్మెల్యే అరెస్ట్: మహారాష్ట్రలో ఎన్‌సిపి ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జితేంద్ర అవద్ తన మద్దతుదారులతో కలిసి పూణేలోని ఒక మాల్‌లో 'హర్ హర్ మహాదేవ్' సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. మాల్‌కు వెళ్లి ప్రేక్షకులపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఎన్సీపీ ఎమ్మెల్యేను థానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తాను బెయిల్ అడగనని జితేంద్ర అవద్ అన్నారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో వర్తక్‌నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నుండి కాల్ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు.  
 
థానేలోని వివియానా మాల్‌లోని మల్టీప్లెక్స్‌లో సోమవారం రాత్రి మరాఠీ చిత్రం 'హర్ హర్ మహదేవ్' ప్రదర్శనను ఆయనతో పాటు మరికొందరు ఎన్‌సిపి కార్యకర్తలు బలవంతంగా నిలిపివేసినందుకు విధ్వంసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై మహారాష్ట్ర మాజీ హౌసింగ్ మంత్రి జితేంద్ర అవద్‌ను శుక్రవారం థానే పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయంగా హైప్ క్రియేట్ చేసేందుకు ఛత్రపతి శివాజీ చరిత్రను వక్రీకరించి చిత్రీకరించారని ఎన్సీపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అహ్వాద్‌ను గతంలో థానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?
8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?