‘ఓరల్ సెక్స్’ నేరమే.. కానీ అంత తీవ్రమైనది కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

By AN TeluguFirst Published Nov 24, 2021, 10:03 AM IST
Highlights

ముఖ రతి నేరమే కానీ, అత్యంత తీవ్రమైనది కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. దీనికి పోక్సో చట్టంలోని సెక్షన్ 4 వర్తిస్తుందని, సెక్షన్ 6, 10 వర్తించవని చెప్పింది. ఈ సెక్షన్ ప్రకారం దోషికి కనీసంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వివరాల్లోకి వెడితే... 

అహ్మదాబాద్ : చిన్నారులతో ముఖ రతిని అత్యంత తీవ్ర నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. సెషన్స్ కోర్టు దోషికి విధించిన 10యేళ్ల జైలు శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. రూ.5,000జరిమానా విధించింది. అయితే, ఇలాంటి నేరాలు శిక్షార్హమైనవేనని హైకోర్టు స్పష్టం చేసింది. బాలుడితో Oral sex చేయించుకున్న వ్యక్తిని దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు పోక్సో చట్టంలోని సెక్షన్ 6, 10 ప్రకారం 10యేళ్ల జైలు శిక్ష విదించింది. ఈ తీర్పును ముద్దాయి high courtలో సవాల్ చేశాడు.

దీన్ని విచారించిన ధర్మాసనం ముఖ రతి నేరమే కానీ, అత్యంత తీవ్రమైనది కాదని పేర్కొంది. దీనికి పోక్సో చట్టంలోని సెక్షన్ 4 వర్తిస్తుందని, సెక్షన్ 6, 10 వర్తించవని చెప్పింది. ఈ సెక్షన్ ప్రకారం దోషికి కనీసంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడి ఇంటికి నిందితుడు వెళ్లాడు. అతని పదేళ్ల కుమారుడిని బయటకు తీసుకెళ్లి sexual harrassementకి పాల్పడ్డాడు. బాలుడు ఆ విషయాన్ని ఇంటి వద్ద ఉన్న పెద్దలకు తెలపడంతో వారు కేసు పెట్టారు. 

ఇదిలా ఉండగా, చిన్నారుల మీద లైంగిక దాడులు మామూలుగా మారిపోయాయి. ఈ నెల మొదట్లో కామంతో కళ్లు మూసుకుపోయిన  ప్రధానోపాధ్యాయుడు.. ‘పట్టుకోండి చూద్దాం’ అనే  ఆట పేరుతో బాలికల కళ్ళకు గంతలు కట్టి, పిల్లలతో కలిపి తాను ఆడుతున్నట్లు గా నటిస్తూనే కళ్ళకు గంతలు కట్టి ఉన్న Girlsను ఏమార్చి.. Store roomలోకి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘోరం వెలుగు చూసింది. ఇప్పటివరకు  నలుగురు చిన్నారులపై Sexual assaultకి పాల్పడినట్లు వారి తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. బాధితులంతా మూడు, నాలుగు తరగతి చదువుతున్న పిల్లలే. బడికి వెళ్లేందుకు ఆ చిన్నారులు భయపడుతుండటంతో వారి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారిని Parents ప్రశ్నించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. నిందితుడు, అక్కడ Principalగా పనిచేస్తున్న అనిల్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.  

ఇద్దరు బిడ్డల తల్లితో పోలీస్ వివాహేతర సంబంధం... వివాహిత అనుమానాస్పద మృతి, పరారీలో ప్రియుడు

చింతలపాలెం ఎస్సై రంజిత్ రెడ్డి, బాధిత విద్యార్థినుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అనిల్ స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడ. ఆ పాఠశాలలో ఎనిమిదేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 28 ఏళ్ల అనిల్ కు గత ఏడాది  పెళ్లయింది. మేళ్లచెరువు మండలం కేంద్రంలో ఉంటూ పాఠశాలకు వెళ్లి వస్తున్నాడు. 

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఆ schoolలో 90 మంది పిల్లలు చదువుతున్నారు. పాఠశాలలో నాలుగు తరగతి గదులు ఉన్నాయి.  ఒక స్టోర్ రూమ్ ఉంది.  అక్కడ అనిల్ తో పాటు మరో ఉపాధ్యాయుడు మాత్రమే పనిచేస్తున్నారు. టీచర్ల కొరత ఉండటంతో 90 మంది పిల్లలను ఒకేచోట ఉంచి పాఠాలు చెబుతున్నారు.  

మధ్యాహ్నం మూడు గంటల మధ్య విద్యార్థులతో ఆటలు ఆడించి ఇంటికి పంపుతున్నారు.  గత పది రోజులుగా బాలికలపై అనిల్ లైంగిక దాడికి పాల్పడుతునట్లు గుర్తించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

click me!