
పాకిస్తాన్ డ్రోన్ల దాడులను భారత్ తిప్పికొట్టింది. LOC వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలను భారత ఆర్మీ సరైన సమాధానం చెప్పింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యవసర భద్రతా చర్యలు అమలు చేస్తున్నారు. ప్రజల భద్రత కోసమే ఈ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పాక్ ప్రోత్సాహం పొందిన ఉగ్రవాద శిబిరాలపై భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరిట క్షిపణి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో పలు ఉగ్ర స్థావరాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ చర్యలను భారత త్రివిధ దళాలు ఎలా ఎదుర్కొన్నాయన్న వివరాలను.. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం కలిసి సంయుక్తంగా మీడియాకు వివరాలు వెల్లడించాయి.
కైనటిక్, నాన్ కైనటిక్ సాధనాలతో భారత్ తిప్పుకొట్టిందని, పశ్చిమ సరిహద్దు ప్రాంతాంలో పాక్ దాడులకు పాల్పడుతోందని విదేశాఖ శాఖ వెల్లడించింది. లేహ్ నుంచి సర్‌క్రీక్ వరకు 34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందని తెలిపింది.
కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. భారత సైనిక స్థావరాలపై పాక్ దాడికి యత్నిస్తోందని తెలిపారు. కశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందన్నారు. భారత్ జరిపిన దాడిలో పాక్‌కు తీవ్ర నష్టం కలిగిందన్నారు. పౌరవిమానాలను కవచంగా ఉపయోగించుకుని దాడి చేస్తోందని వివరించారు.
గురువారం రాత్రి మన సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిందని. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేశామని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. ఈ డ్రోన్లు టర్కీకి చెందినవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు కల్నల్ చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ తన నీచపు బుద్ధిని చూపించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. ఆలయాలు.. గురుద్వారాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసిందన్నారు. ఇంత కన్నా నీచం మరోటి ఏమైనా ఉందా అంటూ మిస్త్రీ విరుచుకుపడ్డారు.
ఎయిర్‌స్సేస్ మూసివేశామని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని కల్నల్ సోఫియా ఖురేషీ అన్నారు. ఎల్‌ఓసీ వెంబడి నిరంతరం పాక్ కాల్పులు జరుపుతోందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అన్నారు. డ్రోన్ శిథిలాల పరిశీలన జరుగుతోందని, ఆ డ్రోన్లు టర్కీకి చెందిన సోన్‌గార్డ్‌వని తెలుస్తోందని అన్నారు.