
భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణుల దాడులు చేపట్టాయి. జైష్-ఎ-మొహమ్మద్ స్థావరంగా పేరుగాంచిన బహవల్‌పూర్ కూడా వీటిలో ఒకటి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ నిర్ణయాత్మక సైనిక చర్య తీసుకున్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులు ‘ఆపరేషన్ సింధూర్’లో భాగమని ధృవీకరించింది. ఈ ఆపరేషన్ భారతదేశంపై దాడులను ప్లాన్ చేయడంలో పాల్గొన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది.
పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత్ ఎలాంటి దాడులు చేయలేదు. భారతదేశం అధికారిక ప్రకటనలో, లక్ష్యాల ఎంపిక విషయంలో, దాడుల విషయంలో సంయమనం పాటించామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేశారు.
భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సంయుక్తంగా అమలు ఈ ఆపరేషన్ చేపట్టారు. భూమి, సముద్రం రెండింటిలోనూ ఈ ఆపరేషన్ జరిగింది. అన్ని దళాలు చురుకుగా పాల్గొన్నాయి, ముఖ్యంగా, దాడుల సమయంలో ఏ భారతీయ జెట్ కూడా నష్టపోలేదని సమాచార వర్గాలు తెలిపాయి.
‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో జరిగిన ఈ దాడిలో బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్, మురిద్కేలోని లష్కర్-ఎ-తోయిబా ఉగ్ర నాయకులను హతమార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తొమ్మిది ప్రదేశాలను గుర్తించి, లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాద శిబిరాలపై జరిపిన అన్ని దాడులు విజయవంతమయ్యాయి. ఆ తొమ్మిది ప్రదేశాలు:
భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసిందని, అక్కడి నుంచి భారతదేశంపై ఉగ్రవాద దాడులు ప్లాన్ చేశారని అధికారిక ప్రకటన విడుదల చేశారు.
"ఏ పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. పహల్గామ్ గ్రవాద దాడి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నాం. ఈ దాడికి బాధ్యులను జవాబుదారీగా చేస్తామనే మా నిబద్ధతకు మేము కట్టుబడి ఉన్నాం" అని ప్రకటన తెలిపింది.
ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదుల ప్రమేయం స్పష్టంగా ఉందని సూచించే విశ్వసనీయ సమాచారం, సాంకేతిక ఇన్‌పుట్ వంటి ఆధారాలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
“ఉగ్రవాదులపై, వారికి మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలపై పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందని భావించారు. బదులుగా, గడిచిన కొన్ని రోజులుగా, పాకిస్తాన్ దానిని తిరస్కరించి, భారతదేశంపై తప్పుడు ఆరోపణలు చేసింది” అని చెప్పుకొచ్చారు.