India Pakistan : పాక్ ఐఎంఎఫ్ నిధులనూ ఉగ్రవాదానికే వాడుతుంది : జమ్మూ కాశ్మీర్ సీఎం ఆందోళన

భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ ఐఎంఎఫ్ పాకిస్థాన్ కు నిధులు ఇచ్చేందుకు సిద్దమయ్యింది. ఈ నిర్ణయంపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. 

Google News Follow Us

India Pakistan : భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం యుద్ద వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్‌కు నిధులు ఇవ్వాలనే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునేందుకు ఐఎంఫ్ నుంచి వచ్చే డబ్బును ఉపయోగిస్తున్నారని ఆయన విమర్శించారు.

''అంతర్జాతీయ సమాజం ఏ ఆలోచిస్తుందో అర్థం కావడంలేదు. పాకిస్తాన్‌కు నిధులు ఇవ్వడం వల్ల ఉద్రిక్తతలు తగ్గవని... పూంచ్, రాజౌరి, ఉరి, తంగ్ధార్ వంటి ప్రాంతాల్లో విధ్వంసాలను కొనసాగించేందుకు వారి చర్యలను మరింతగా ప్రోత్సహిస్తాయి'' అని జమ్మూ కాశ్మీర్ సీఎం ఆందోళన వ్యక్తం చేసారు. 

పాకిస్థాన్ ఉపయోగిస్తున్న ఆయుధాలకు ఐఎంఎఫ్ డబ్బులు ఇస్తున్నట్లు ఉందని... దీనివల్ల ఉపఖండంలో ఉద్రిక్తత ఎలా తగ్గుతాయని ఒమర్ అబ్దుల్లా అంతర్జాతీయ సమాజాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికన ఆందోళన వ్యక్తం చేసారు. 

 

అయితే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి నిధులు ఇవ్వడాన్ని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటువంటి మద్దతు ప్రపంచ సంస్థల ప్రతిష్టకే భంగం కలిగిస్తుందని, అంతర్జాతీయ నిబంధనలను దెబ్బతీస్తుందని హెచ్చరించింది.

 పాకిస్తాన్ ఆర్థిక సంస్కరణ కార్యక్రమంలో మొదటి సమీక్షను IMF బోర్డు ఆమోదించింది. దీని ద్వారా దాదాపు 1 బిలియన్ డాలర్ల విడుదలకు వీలు కల్పించింది. పాక్ లో ఆర్థిక పునరుద్ధరణ కొనసాగడానికి ఈ నిధులు దోహదపడతాయని IMF తెలిపింది.

 

పాకిస్తాన్‌కు IMF రుణం మంజూరు చేయడాన్ని భారతదేశం వ్యతిరేకించిం అయితే  IMF నిబంధనలు అధికారికంగా "నో" ఓటు వేయడానికి అనుమతించవు కాబట్టి దూరంగా ఉంది. దీంతో పాక్  కు రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ సిద్దమయ్యింది. 

ఇంకా, IMF ఓటింగ్ వ్యవస్థ పరిమితుల్లో న్యూఢిల్లీ తన తీవ్ర అసమ్మతిని తెలియజేసింది. అధికారికంగా తన అభ్యంతరాలను నమోదు చేసే అవకాశాన్ని ఉపయోగించుకుంది.  ఉగ్రవాదం కోసం పాక్ ఈ నిధుల దుర్వినియోగం చేస్తుందని వివరించింది. 

 

Read more Articles on