రోడ్డు ప్రమాదంలో భర్త మృతి... భార్య ఏం చేసిందంటే...

Published : Dec 30, 2019, 11:59 AM ISTUpdated : Dec 30, 2019, 12:10 PM IST
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి... భార్య ఏం చేసిందంటే...

సారాంశం

రవీంద్ర అనే వ్యక్తి పానీపట్‌లోని ఒక ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన కారులో అతను రోహ్‌తక్ నుంచి పానీపట్‌కు వస్తున్నాడు. ఈ సమయంలో ఒక పశువును తప్పించబోయి చెట్టును ఢీ కొన్నాడు. 

ఆమెకు భర్త అంటే ప్రాణం. అతనే లోకంగా బతికింది. సడెన్ గా ఓ రోడ్డు ప్రమాదం వారిద్దరినీ దూరం చేసింది. బయటకు వెళ్లిన భర్త శవమై ఇంటికి చేరాడు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భర్త తనకు దూరం కావడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. రైలు కిందపడి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హరియాణనాలోని రోహ్ తక్ లో చోటుచేసుకుంది.

ALSo Read: దారికప్పేసిన పొగ మంచు... కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి

పూర్తి వివరాల్లోకి వెళితే... రవీంద్ర అనే వ్యక్తి పానీపట్‌లోని ఒక ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన కారులో అతను రోహ్‌తక్ నుంచి పానీపట్‌కు వస్తున్నాడు. ఈ సమయంలో ఒక పశువును తప్పించబోయి చెట్టును ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో రవీంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులు మృతుని భార్యకు తెలియజేశారు. అయితే ఈ వార్త విన్న వెంటనే అతని భార్య జాట్లా ఆ వార్త విని తట్టుకోలేకపోయింది.

రోడ్డు వద్దనున్న రైల్వే లైను సమీపానికి వెళ్లింది. అప్పటికే అటుగా వేగంగా వస్తున్న  రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.  రైలు ఢీకొట్టి ఆమె కూడా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మైనర్ బాలికకు బలవంతపు పెళ్లి... ఇంట్లోనే బంధించి...

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు