ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య: ఆ ఇల్లు ఇప్పుడిలా...

Published : Dec 30, 2019, 11:24 AM IST
ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య: ఆ ఇల్లు ఇప్పుడిలా...

సారాంశం

నిరుడు జులైలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఇంటిలో ఓ డయాగ్నస్టిక్ సెంటర్ నడుస్తోంది. తనకు ఏ విధమైన భయాలూ లేవని సెంటర్ యజమాని అంటున్నారు.

న్యూఢిల్లీ: నిరుడు జులైలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారు ఆత్మహత్య చేసుకున్న ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ అచ్చి రాదని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఇంటిలో ఓ డయాగ్నిస్టిక్ సెంచర్ నడుస్తోంది. 

అతీత శక్తులపై తనకు నమ్మకం లేదని డయాగ్నిస్టిక్ సెంటర్ యజమాని అంటున్నారు. అతీత శక్తులపై తనకు విశ్వాసం లేదని, అటువంటి నమ్మకం ఉంటే తాను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కానని, పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న రోగులకు కూడా ఈ సమస్యా లేదని డాక్టర్ మోహన్ సింగ్ అన్నారు.

తనకు ఓ విధమైన సమస్య లేదని, రోడ్డుకు దగ్గరగా ఉండడంతో తనకు సౌకర్యంగా ఉందని ఆయన చెప్పారు. అయితే, పూజారి పూజలు చేస్తున్నాడు. గౌరీ గణేష్ లకు పూజలు చేస్తున్నట్లు పూజారి చెప్పాడు. 

అతీతశక్తులపై, దుష్టశక్తులపై నమ్మకం లేకపోయినప్పటికీ ఏదైనా పి ప్రారంభించినప్పుడు పూజలు చేయడం పరిపాటి అని ఆయన అన్నారు. జరిగిందేదో జరిగింది, ఇప్పుడు ఏ సమస్యా లేదని స్థానికుడు రవీందర్ అన్నాడు. 

వాళ్లు మంచి వ్యక్తులని, దుష్టశక్తులు ఉండే అవకాశం లేదని, వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి చేరుకున్నాయని సురేష్ అనే వ్యక్తి అన్నాడు. 

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ