ఒడిశా రైలు ప్రమాదం.. బోగీల నుంచి దుర్వాసన వస్తోందని స్థానికుల ఆందోళన.. అధికారులు ఏం చెప్పారంటే ?

By Asianet NewsFirst Published Jun 10, 2023, 1:24 PM IST
Highlights

ఒడిశా రైలు ప్రమాదం వల్ల బహనాగ బజార్ రైల్వే స్టేషన్ పరిసరాలు రక్తసిక్తంగా మారాయి. ఆ సమయంలో ఎటు చూసిన మానవ శరీర భాగాలు, డెడ్ బాడీలు కనిపించాయి. ఈ దృష్యాలు కంటి నిండా చూసిన స్థానికులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. అయితే ఓ బోగీలో నుంచి దుర్వాసన వస్తుండటంతో అందులో ఇంకా డెడ్ బాడీలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి రైల్వే అధికారులు చేరుకొని, ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. 

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన మూడు రైలు ప్రమాదాల్లో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో దెబ్బతిన్న బోగీ నుంచి దుర్వాసన వస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. దుర్వాసనకు మానవ శరీరాలు కారణం కాదని, కుళ్లిపోయిన గుడ్లే కారణమని చెప్పారు. 

గాంధీని గాడ్సే చంపినా.. ఈ దేశ కుమారుడే, కానీ ఔరంగజేబులా ఆక్రమణదారుడు కాదు - బీజేపీ నేత గిరిరాజ్ సింగ్

అధికారులు అక్కడే వదిలేసిన బోగీ నుంచి దుర్వాసన వస్తోందని, ఇంకా కొన్ని మృతదేహాలు అక్కడే ఉండి ఉండొచ్చని రైల్వేస్టేషన్ సమీపంలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల నిరసనతో రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బోగిల్లో మానవ శరీరాలు ఏవీ లేవని, కుళ్లిపోయిన గుడ్ల నుంచి దుర్వాసన వెదజల్లుతున్నట్లు గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్ నుంచి రెండుసార్లు సైట్ క్లియరెన్స్ వచ్చిందని ఆగ్నేయ రైల్వే సీపీఆర్వో ఆదిత్య కుమార్ చౌదరి మీడియాతో తెలిపారు. యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ లో మూడు టన్నుల గుడ్లను తరలిస్తున్నారని, ప్రమాద జరిగిన తరువాత అవి అందులోనే ఉండిపోయాయని అన్నారు.  ఆ గుడ్లన్నీ కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని ఆయన చెప్పారు. ప్రమాద స్థలం నుంచి మూడు ట్రాక్టర్లలో గుడ్లను తొలగించాం అని చౌదరి వివరించారు. 

‘గాడ్సే-ఆప్టేల వారసులెవరో తెలుసా’ ? కొల్హాపూర్ ఘర్షణల నేపథ్యంలో ఔరంగజేబ్ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ పై ఒవైసీ ఫైర్

జూన్ 2వ తేదీన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 288 మంది మరణించగా, 1,200 మందికి పైగా గాయపడ్డారు. ఆ సమయంలో రైలు పట్టాలపై అవయవాలు లేని మృతదేహాలు, రక్తపాతాలు కనిపించిన పలు భయానక, బాధాకరమైన దృశ్యాలు బయటపడ్డాయి. కాగా.. ఇప్పటివరకు 200కు పైగా మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించగా, భువనేశ్వర్ ఎయిమ్స్ మార్చురీలో ఇంకా 80 మృతదేహాలు గుర్తించబడలేదు.

ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. కాగా.. బాలాసోర్ రైల్వే ప్రమాదానికి దారితీసిన నేరపూరిత నిర్లక్ష్య ఆరోపణలపై సిబిఐ బృందం దర్యాప్తు ప్రారంభించింది. రైళ్ల ఉనికిని గుర్తించే ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ప్రాథమిక విచారణలో తేలడం, ఈ దుర్ఘటన వెనుక విద్రోహం ఉందని అధికారులు అనుమానించడంతో రైల్వే శాఖ సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసింది.

దారుణం.. ప్రియుడి ఇంటి వాటర్ ట్యాంకులో శవంగా తేలిన ప్రియురాలు.. అసలేం జరిగిందంటే ?

ఐపీసీ సెక్షన్లు 337, 338, 304 ఏ (నిర్లక్ష్యంతో మరణానికి కారణం), 34 (ఉమ్మడి ఉద్దేశ్యం), రైల్వే చట్టంలోని సెక్షన్లు 153 (చట్టవిరుద్ధమైన, నిర్లక్ష్య చర్య రైల్వే ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం కలిగించడం), 154, 175 (ప్రాణాలకు ప్రమాదం కలిగించడం) కింద జూన్ 3 న కటక్ లోని జీఆర్పీ (ప్రభుత్వ రైల్వే పోలీస్) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సీబీఐ స్వాధీనం చేసుకుంది.

click me!