ఒడిశా రైలు ప్రమాదానికి మతం రంగు పులమొద్దు: పోలీసుల వార్నింగ్

By Mahesh KFirst Published Jun 4, 2023, 5:11 PM IST
Highlights

ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదానికి మతం రంగు పులమవద్దని ఒడిశా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కొందరు సోషల్ మీడియాలో దురుద్దేశపూరితంగా వదంతలు వ్యాప్తి చేస్తున్నారని, అలాంటి వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి మతం రంగు పులమొద్దని ఆ రాష్ట్ర పోలీసులు కఠిన హెచ్చరికలు చేశారు. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ దురుద్దేశపూరితంగా ఈ ఘటన గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఓ ట్వీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అలాంటి వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని వివరించారు.

ఈ ఘటన చుట్టూ తప్పుడు వదంతులు వ్యాప్తి చేసి మతపరమైన ఘర్షణలను ఎగదోయడానికి ప్రయత్నిస్తే వారిపై అనేక న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. బాలాసోర్ మూడు ట్రైన్‌ల ప్రమాదంపై గవర్నమెంట్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో మరణాల సంఖ్య 288 వరకు వెళ్లాయి. సుమారు వేయి మంది గాయపడ్డారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Also Read: పెళ్లి చేసుకున్న మొదటి రాత్రే నవ దంపతులు మృతి.. పోస్టు మార్టంలో తేలిన విషయం ఇదే!

సిగ్నలింగ్ ఇంటర్‌ఫెరెన్స్ చోటుచేసుకున్నట్టు గుర్తించామని, దీనిపై దర్యాప్తు తర్వాత మరిన్ని విషయాలు బయ టకు వస్తాయని రైల్వే బోర్డు ఆపరేషన్స్ అండ్ బీడీ, మెంబర్ జయ వర్మ సిన్హా చెప్పారు.

It has come to notice that some social media handles are mischievously giving communal colour to the tragic train accident at Balasore. This is highly unfortunate.

Investigation by the GRP, Odisha into the cause and all other aspects of the accident is going on.

— Odisha Police (@odisha_police)

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పింది వాస్తవ మేనని సిన్హా తెలిపారు. ఈ ప్రమాదానికి కవచ్ టెక్నాలజీ తో సంబంధం లేదని వివరించారు. ఈ ప్రమాదాన్ని కవచ్ టెక్నాలజీ అడ్డుకుని ఉండేది కాదని అన్నారు.

click me!