ఒడిశా రైలు ప్రమాదం : రైలు ప్రమాదాన్ని 'కవచ్' ఎందుకు అడ్డుకోలేదో వివ‌రించిన రైల్వే అధికారులు

By Mahesh RajamoniFirst Published Jun 4, 2023, 4:23 PM IST
Highlights

Odisha train accident: ఒడిశా రైలు ప్ర‌మాదం గురించి ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు విమర్శలు, ప్ర‌శ్న‌లు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కవచ్ వ్యవస్థ ద్వారా ఒడిశాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదాన్ని నివారించవచ్చనే వాదనను రైల్వే అధికారులు తోసిపుచ్చారు. హైస్పీడ్ వాహనం ముందు అకస్మాత్తుగా అడ్డంకి కనిపిస్తే, ప్రపంచంలో ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రమాదాన్ని నివారించలేదని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
 

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్ర‌మాదం గురించి ప్ర‌భుత్వాన్ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్న‌లు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కవచ్ వ్యవస్థ ద్వారా ఒడిశాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదాన్ని నివారించవచ్చనే వాదనను రైల్వే అధికారులు తోసిపుచ్చారు. హైస్పీడ్ వాహనం ముందు అకస్మాత్తుగా అడ్డంకి కనిపిస్తే, ప్రపంచంలో ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రమాదాన్ని నివారించలేదని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఒడిశా రైలు ప్ర‌మాదంలో మ‌రో కీల‌క విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. లూప్ లైన్ లో అగివున్న గూడ్స్ రైలును కోర‌మాండ‌ల్  ఎక్స్ ప్రెస్ వెనుక నుంచి వ‌చ్చి ఢీ కొట్టింది. ఇదే స‌మ‌యంలో ప‌క్క‌నున్న డౌన్ లైన్ పై య‌శ్వంత్ పూర్ రైలు వెళ్తోంది. దీని వ‌ల్ల ప్ర‌మాదం తీవ్రంగా అధికంగా న‌మోదైంది. కాగా, ఈ మార్గంలో కవచ్ క్రియాశీలకంగా ఉన్నప్పటికీ, కోరమాండల్ మూడు రైలు ప్రమాదాన్ని నివారించేది కాదని రైల్ బోర్డు సభ్యుడు జయవర్మ సిన్హా తెలిపిన‌ట్టు ఎక‌నామిక్స్ టైమ్స్ నివేదించింది. కదులుతున్న వాహనం ముందు అకస్మాత్తుగా అడ్డంకి వస్తే, ప్రపంచంలోని ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రమాదాన్ని నివారించదని రైల్వే బోర్డు ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ సభ్యుడు జయవర్మ సిన్హా అన్నారు.

మాన్యువల్ అయినా, వాతావరణానికి సంబంధించినదైనా, మరేదైనా లోపం ఉందని, పూర్తి దర్యాప్తు ద్వారా తెలుస్తుందనీ,  అన్ని ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ లో ఎక్విప్ మెంట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందని జయవర్మ అన్నారు. 'ప్రాథమిక సమాచారం ప్రకారం సిగ్నలింగ్ లో ఏదో సమస్య తలెత్తింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి సమగ్ర నివేదిక కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. అయితే, రైల్వే సేఫ్టీ కమిషన్ పూర్తి విచారణ తర్వాతే ప్రమాదానికి దారితీసిన తప్పిదం ఏమిటనేది తెలుస్తుందని రైల్వే అధికారి తెలిపారు. ఆ సమయంలో రైళ్లు ఓవర్ స్పెండ్ అవుతున్నాయనే ఊహాగానాలను తోసిపుచ్చారు. గూడ్స్ రైలు ఇనుప ధాతువులను తీసుకెళ్తుండటంతో అత్యధికంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పై ప్రభావం పడింది. భారీ సంఖ్యలో మరణాలు, గాయాలకు ఇదే కారణం. పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు డౌన్ లైన్ నుంచి 126 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ చివరి రెండు బోగీలను ఢీకొన్నాయి.

'ఇంటర్ లాకింగ్ మెకానిజం వైఫల్యమే ప్రమాదానికి కారణమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సమయంలో జరిగిన మార్పు ఈ ప్రమాదానికి కారణమైంది. ఎవరు చేశారు, ఎలా జరిగిందో సరైన దర్యాప్తు తర్వాత తెలుస్తుంది' అని వైష్ణవ్ తెలిపిన‌ట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది. ఇంటర్ లాకింగ్ మెకానిజం గురించి రైల్వే బోర్డు అధికారి సందీప్ మాథుర్ వివరిస్తూ, లూప్ లైన్ క్లియర్ గా ఉందా లేదా ఆక్రమించబడిందా అని ఇంటర్ లాకింగ్ మెకానిజం చూపిస్తుందని చెప్పారు. ఈ మెకానిజం ఎలక్ట్రానిక్ లేదా నాన్ ఎలక్ట్రానిక్ కావచ్చుననీ, ప్రమాద స్థలంలో ఎలక్ట్రానిక్ మెకానిజం ఉందని ఆయన చెప్పారు.

జయవర్మసిన్హా మాట్లాడుతూ ప్రమాదం తర్వాత రైల్వే శాఖ మొదట సహాయక చర్యలపై దృష్టి సారించిందని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత రైల్వే శాఖ తొలుత సహాయక చర్యలు చేపట్టిందనీ, ఆ తర్వాత మరమ్మతు పనులు జరుగుతున్నాయని తెలిపారు. బహనాగా స్టేషన్ లో నాలుగు లైన్లు ఉన్నాయి. ఇందులో రెండు ప్రధాన లైన్లు ఉన్నాయి. లూప్ లైన్ లో గూడ్స్ రైలు ఉంది. స్టేషన్ లో డ్రైవర్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రెండు వాహనాలు పూర్తి వేగంతో నడుస్తున్నాయని తెలిపారు. క్షతగాత్రులు లేదా మరణించిన వారి కుటుంబ సభ్యుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రైల్వే శాఖ ఇప్పటికే రూ.3.5 కోట్ల ఎక్స్ గ్రేషియాను పంపిణీ చేసిందని తెలిపారు. 

click me!