ఆన్‌లైన్ క్లాసులు: తండ్రి స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని.. బాలుడు ఆత్మహత్య

By Siva KodatiFirst Published Jul 31, 2020, 4:50 PM IST
Highlights

కరోనాతో విధించిన లాక్‌డౌన్ కారణంగా పిల్లలు స్కూల్‌కు వెళ్లడం లేదు. ఇల్లే వారికి పాఠశాలగా మారింది. ఫోన్, ల్యాప్‌టాప్‌ల సాయంతో విద్యార్ధులు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. 

కరోనాతో విధించిన లాక్‌డౌన్ కారణంగా పిల్లలు స్కూల్‌కు వెళ్లడం లేదు. ఇల్లే వారికి పాఠశాలగా మారింది. ఫోన్, ల్యాప్‌టాప్‌ల సాయంతో విద్యార్ధులు ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. అయితే పేదవారు వీటిని సమకూర్చలేకపోవవడంతో పేద విద్యార్దుల పరిస్ధితి ఇబ్బందికరంగా మారింది.

ఈ క్రమంలో ఆన్‌లైన్‌ క్లాసుల్లో పాల్గొనేందుకు తన తండ్రి తనకు స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం లేదని మనస్తాపానికి గురైన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలోని పన్రుతి పట్టణంలోని ఓ హైస్కూల్‌లో ఓ 14 ఏళ్ల బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు.

Also Read:డాక్టర్ సలహా.. తల్లిదండ్రుల కఠినవైఖరి: బాలిక ఆత్మహత్య, కారణమిదే..!!

ఆ బాలుడి తండ్రి సిరుతోండమదేవి గ్రామంలో జీడిపప్పు పంటను పండిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు స్మార్ట్‌ఫోన్ కావాలని ఆ బాలుడు తండ్రిని అడిగాడు. దీంతో ఆయన జీడిపప్పు పంటను అమ్మిన తర్వాత కొనిస్తానని చెప్పాడు. దీంతో తండ్రిపై ఆ బాలుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాగా లాక్‌డౌన్ కారణంగా పేదల పరిస్థితి దారుణంగా తయారైంది. ఉపాధి లేకపోవడంతో దేశంలో చాలా మంది పేదలు ఆకలితో అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆన్‌లైన్ క్లాసుల విధానం రావడంతో పేదలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల కోసం తమిళనాడు ప్రభుత్వం ఇటీవల కల్వీ టీవీ నెట్‌వర్క్ ద్వారా ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించింది.

click me!