నేను రోబోను కాను: రాహుల్ గాంధీకి సినీ నటి ఖుష్బూ ఝలక్

By Siva KodatiFirst Published Jul 31, 2020, 4:04 PM IST
Highlights

కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్భూ ... రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని ఆమె స్వాగతించారు

కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్భూ ... రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని ఆమె స్వాగతించారు. అయితే ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని.. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఖుష్భూ స్పష్టం చేశారు.

నూతన విద్యా విధానంపై పార్టీ విధానంతో తాను పూర్తిగా విభేదిస్తున్నానని... ఇందుకు రాహుల్ గాంధీ తనను క్షమించాలని అన్నారు. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని.. తాను రోబోను కానని, కీలు బొమ్మను అసలే కాదని తేల్చి చెప్పారు.

ప్రతి విషయంలోనూ అధిష్టానానికి తలూపాల్సిన పని లేదని.. ఓ సాధారణ పౌరురాలిగా మన వైఖరి చాలా ధైర్యంతో చెప్పాలని ఖుష్భూ వ్యాఖ్యానించారు. కాగా జాతీయ విద్యా విధానంలో సమూల మార్పులే లక్ష్యంగా నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.

నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనుంది. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో పాటు విద్యార్ధులకు పాఠ్యాంశాల భారాన్ని తగ్గించాలనేది నూతన విద్యా విధానం ముఖ్యోద్దేశం. అలాగే విద్యా హక్కు చట్టం కింద 3 నుంచి 18 ఏళ్ల వరకు విద్యను తప్పనిసరి చేస్తూ నిర్ణయం కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

click me!