పెళ్లిలో డీజేలు, బారాత్ లు బంద్.. వరుడికి, అతిథులకు క్లీన్ షేవ్ తప్పనిసరి.. ఎక్కడో తెలుసా?

By SumaBala BukkaFirst Published Jun 27, 2022, 11:25 AM IST
Highlights

పెళ్లిలో బారాత్ లు, బాణాసంచాలు, డీజేలు ఉండకూడదని, వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాలని.. సింపుల్ గా పెళ్లి కానిచ్చేయాలని ఓ రెండు కమ్యూనిటీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవి పాటించని వారిమీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించాయి. 
 

జైపూర్ : ఈ రోజుల్లో పెళ్ళంటేనే భారీ డెకరేషన్ లు, డీజే సౌండ్ లు, భారీ ముస్తాబులు, ఇతరత్రా ఆర్భాటాలు.. కాలం మారుతున్న కొద్ది వివాహాల సంస్కృతి మారిపోతూ వస్తుంది. హంగూ,ఆర్భాటాలకు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఒకరు చేశారని.. మరొకరు అదే ఫాలో అవుతూ.. కొందరు తమ తాహతుకు మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా వారు అప్పుల్లో కూరుకు పోతున్నారు. పెళ్లంటేనే జీవితకాలం సంపాదించిందంతా ఖర్చు చేసే వేడుకగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ సామాజికవర్గం ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. 

రాజస్థాన్ పాలిలోని రెండు సామాజిక వర్గాలు ఈ హంగు, ఆర్భాటాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాయి. తమ సామాజిక వర్గానికి చెందినవారు అప్పుల్లో కూరుకుపోయి ఇబ్బందుల్లో పడకూదని, పేదరికంలోకి దిగజారకూడదని ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. వివాహాలను చాలా తక్కువ ఖర్చుతో చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి.

భారీగా అలంకరణ, డీజే చప్పుళ్లు, బాణాసంచా లేకుండా.. గుర్రంపై వరుడి ఊరేగింపు లేకుండా వివాహాలు జరుపుకోవాలని  kumavat,  జాట్ సామాజికవర్గాల నేతలు నిర్ణయించారు. వధూవరులకు ఇచ్చే నగలు, నగదు, దుస్తులు లాంటి బహుమతులపై కూడా పరిమితులు విధించేందుకు సిద్ధమయ్యారు. వరుడితో పాటు, వివాహానికి  హాజరయ్యే వారికి గడ్డం ఉండకూడదని స్పష్టం చేశారు. వివాహ వేడుకను దైవకార్యంగా, వరుడిని రాజుగా భావించే  పెళ్లిలో వరుడికి గడ్డం ఉండకూడదని, పెళ్లికి వచ్చే వారు కూడా గడ్డాలతో రాకూడదని kumavat వర్గం నేత లక్ష్మీనారాయణ వెల్లడించారు.  అలంకారాలు, మ్యూజిక్ ఇతర పనులకు డబ్బులు వృధా చేయడం అనవసరం అని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాలో విషాదం.. బార్ లో 21మంది టీనేజర్లు మృతి, విషప్రయోగం అనుమానాలు...

అదేవిధంగా, పాలిలోని  రోహెత్ సబ్ డివిజన్ లోని  ఐదు గ్రామాలకు చెందిన జాట్ కమ్యూనిటీ నేతలు కూడా వివాహ కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేయకూడదని నిబంధనల రూపొందించుకున్నారు. వివాహ ఊరేగింపులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ’సమాజంలోని  అన్ని కుటుంబాల వివాహాల్లో ఏకరూపత కోసం  కొన్ని సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం’  అని భకరివాలా గ్రామ సర్పంచి అమ్నారం బెనివాల్ తెలిపారు. 

‘డబ్బు ఉన్నవాళ్లు వివాహాలను ఆర్భాటంగా చేస్తున్నారు.  ఇవి మధ్యతరగతి, పేద వారిపై ప్రభావం చూపుతున్నాయి. వారు కూడా ఈ తరహాలో చేయాలని  అప్పులపాలవుతున్నారు. సమాజంలో సమానత్వం, వివాహ కార్యక్రమాల్లో ఏకరూపత తీసుకురావాలని ఉద్దేశంతోనే ఈ నియమాలను తీసుకువచ్చాం’  అని సర్పంచి వెల్లడించారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

 

click me!