
బీహార్ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్ భవన్ లో తన రాజీనామా పత్రాన్ని బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కు అందజేశారు. త్వరలోనే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. మరి కొన్ని గంటల్లోనే బీహార్ లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం కొలువు దీరనుంది.
రామ్ లల్లా శిల కోసం నా భార్య తాళి తాకట్టు పెట్టా..- కాంట్రాక్టర్ శ్రీనివాస్
ఆదివారం ఉదయం జరిగిన జనతాదళ్ (యునైటెడ్) శాసనసభ సమావేశంలో నితీష్ కుమార్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారని
‘ఇండియా టుడే టీవీ’ కథనం పేర్కొంది. జేడీయూ సీనియర్ నేత నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి రెండేళ్ల కిందట వైదొలిగారు. మళ్లీ బీజేపీ నేతృత్వంలోని అదే కూటమిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తేల్చి చెప్పారు. అయితే జేడీయూ ఎమ్మెల్యేలంతా నితీష్ కుమార్ నిర్ణయానికి మద్దతు పలికారు.
బీహార్ బీజేపీ శాసనసభ్యులు కూడా ఈ ఉదయం సమావేశమై తమ వ్యూహంపై చర్చించారు. ఈ రోజు జేడీయూ-బీజేపీ శాసనసభా సమావేశం కూడా జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా.. శనివారం సాయంత్రం ఆర్జేడీ నాయకులు సమావేశమయ్యారు. జరగబోయే పరిణామాలకు సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు అధికారం ఇచ్చారు. ఈ విషయాన్ని ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మనోజ్ ఝా ప్రకటించారు.