union budget 2024:బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్, మొరార్జీ రికార్డు సమం

By narsimha lode  |  First Published Feb 1, 2024, 11:08 AM IST

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  ఇవాళ  మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  వరుసగా ఆరోసారి బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టారు.


న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్  గురువారం నాడు  కేంద్ర బడ్జెట్ 2024 ను ప్రవేశ పెట్టారు. ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్ర ప్రభుత్వం  మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది కేంద్ర ప్రభుత్వం.  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  ఇవాళ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వరుసగా ఆరోసారి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. గతంలో మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరేళ్ల పాటు బడ్జెట్ ను సమర్పించారు. 

2019 జూలై నుండి ఆర్ధిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ కొనసాగుతున్నారు. ఇప్పటికే నిర్మలా సీతారామన్  ఐదు బడ్జెట్లను సమర్పించారు.  ఇవాళ మధ్యంతర బడ్జెట్ ను సమర్పించారు.  దీంతో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా రికార్డులను నిర్మలా సీతారామన్ అధిగమించారు.వీరంతా  ఐదు పూర్తి స్థాయి బడ్జెట్ లను సమర్పించారు.

Latest Videos

undefined

also read:union budget 2024: బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

1959 నుండి  1964 వరకు  ఐదు వార్షిక బడ్జెట్లు,  ఒక మధ్యంతర బడ్జెట్ ను మొరార్జీ దేశాయ్  సమర్పించారు.  10 బడ్జెట్లను ప్రవేశ పెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ కలిగి ఉన్నారు.ఇందిరా గాంధీ తర్వాత  బడ్జెట్ ప్రవేశ పెట్టిన మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డుల్లోకి ఎక్కారు.  1970-71లో  ఇందిరా గాంధీ  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
 

click me!