Petrol Diesel Price: బడ్జెట్ 2024-25 వేళ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

By Mahesh RajamoniFirst Published Feb 1, 2024, 10:48 AM IST
Highlights

Petrol Diesel Price: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్ గురువారం పార్ల‌మెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. అంద‌రి దృష్టి బ‌డ్జెట్ పై ఉన్న క్ర‌మంలో దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు కొత్తగా పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను ప్రకటించాయి.
 

Petrol Diesel Price Today: ప్ర‌స్తుతం దేశ‌ప్ర‌జ‌లంద‌రి చూపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెడుతున్న బ‌డ్జెట్ పైనే ఉంది. దేశ‌ ప్ర‌జ‌ల‌కు నిర్మ‌లమ్మ‌ ఎలాంటి గుడ్ న్యూస్ చెబుతార‌నే ఆస‌క్తి నెల‌కొంది. బ‌డ్జెట్ రోజున చ‌మురు కంపెనీలు షాక్ ఇస్తూ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను పెంచాయి. అలాగే, పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లను కూడా పెంచాయి. గురువారం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.84 ఉండగా, డీజిల్ ధర రూ.89.47గా ఉంది.

ప్రభుత్వ రంగ‌ చమురు సంస్థలు, ధరలను సమీక్షించిన త‌ర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ రేట్లను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. అయితే, ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు గ‌మ‌నిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.74.95కు చేరింది. అదేసమయంలో 1 లీటర్ డీజిల్ ధర రూ.69.39గా ఉంది.

Latest Videos

LPG price hike: బడ్జెట్ రోజున షాక్..పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

1 ఫిబ్రవరి 2024 దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెట్రోల్ ధ‌ర‌లు

  • న్యూఢిల్లీ    ₹ 96.72
  • కోల్‌కతా    ₹ 106.03    
  • ముంబై    ₹ 106.31
  • చెన్నై    ₹ 102.63
  • బెంగళూరు    ₹ 101.94    
  • హైదరాబాద్    ₹ 109.66

1 ఫిబ్రవరి 2024 దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో డీజిల్ ధ‌ర‌లు

  • న్యూఢిల్లీ    ₹ 89.62    
  • కోల్‌కతా    ₹ 92.76
  • ముంబై    ₹ 94.27
  • చెన్నై    ₹ 94.24
  • బెంగళూరు    ₹ 87.89
  • హైదరాబాద్    ₹ 97.82


అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు కొన్నిసార్లు డాలర్ రేటుతో ప్రభావితమవుతాయి. డాలర్ ఖరీదుగా ఉంటే ముడిచమురు కొనడం మరింత ఖరీదు అవుతుంది. అంటే అంత‌ర్జాతీయంగా పెరిగే ధ‌ర‌లు కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను ప్రభావితం చేస్తాయి. అయా ప‌రిస్థితుల ఆధారంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సమీక్షిస్తారు. కాగా, మార్కెట్లో విక్రయించే పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు చెల్లించే డబ్బులో సగానికి పైగా కేంద్ర, రాష్ట్రాల పన్నుల రూపంలో వెళ్తుంది. పెట్రోల్ పై 55.5 శాతం, డీజిల్ పై 47.3 శాతం పన్నులు ఉండ‌టం గ‌మ‌నార్హం.

బడ్జెట్ గురించి మీకు తెలియని టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవి

click me!