9 నెలల్లో 1.6 రెట్లు పెరిగిన క్రెడిట్ ఫ్లో.. రూ. 22.8 ట్రిలియన్లకు చేరిక.. ఏ రంగంలో ఎంత వృద్ధి ఉందంటే ?

By Sairam Indur  |  First Published Feb 1, 2024, 10:35 AM IST

ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరంలో గత 9 నెలల్లో (ఏప్రిల్ నుండి డిసెంబర్ 2023 వరకు) క్రెడిట్ ఫ్లో (credit flow) గణనీయంగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం (this financial year) మొదటి తొమ్మిది నెలల్లో క్రెడిట్ ఫ్లో 1.6 రెట్లు పెరిగి రూ. 22.8 ట్రిలియన్లకు చేరుకుంది.


union budget 2024:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాసేపట్లో మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. దాని కోసం ఇప్పటికే ఆమె పార్లమెంట్ కు చేరుకున్నారు. గత 9 నెలల్లో (ఏప్రిల్ నుండి డిసెంబర్ 2023 వరకు) క్రెడిట్ ఫ్లో గణనీయంగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో క్రెడిట్ ఫ్లో 1.6 రెట్లు పెరిగి రూ. 22.8 ట్రిలియన్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 14.1 ట్రిలియన్లుగా ఉంది. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.8.7 లక్షల కోట్ల రుణ ప్రవాహం పెరిగింది.

union budget 2024: బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Latest Videos

undefined

క్రెడిట్ ఫ్లో వృద్ధి ఏ రంగంలో ఎలా ఉందంటే ? 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నివేదిక ప్రకారం.. గత 9 నెలల్లో (ఏప్రిల్ నుండి డిసెంబర్ 2023 వరకు), వ్యవసాయం దాని అనుబంధ రంగం 1.5 రెట్లు, పరిశ్రమల రంగం 1.8 రెట్లు పెరిగింది. ఎంఎస్ఎంఈ రంగం 1.7 రెట్లు పెరిగింది. మౌలిక సదుపాయాల రంగంలో 6.2 రెట్లు, సేవా రంగంలో 1.4 రెట్లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో 0.6 రెట్లు వృద్ధి చెందింది.

LPG price hike: బడ్జెట్ రోజున షాక్..పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు

గ్రామీణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ గణాంకాలు రుణ ప్రవాహంలో విపరీతమైన పెరుగుదల ఉన్నట్లు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గ్రామీణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాకుండా ఈ గణాంకాలు గ్రామీణ ప్రాంతాల్లో రుణ ప్రవాహ సంక్షోభం గురించిన అన్ని చర్చలను కూడా తోసిపుచ్చాయి. క్రెడిట్ ఫ్లో ఈ గణాంకాలను చూస్తే 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో 7% కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించడం కష్టమైన పని కాదని తెలుస్తోంది.

CM: ఇంతకీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయవచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి ?

జనవరి 2024లో రూ.1.72 లక్షల కోట్లకు చేరుకున్న జీఎస్టీ
2024 జనవరిలో జీఎస్టీ నుండి ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. జనవరి 2024లో జీఎస్టీ వసూళ్లు 10.4 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది అంటే 2023 జనవరిలో రూ.1,55,922 కోట్లు. జనవరి 2024లో వరుసగా 12వ నెల, జీఎస్టీ వసూళ్లు రూ. 1.5 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లు పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో బలానికి సంకేతమని స్పష్టం చేశారు. 

click me!