
మహారాష్ట్ర రాజకీయాలు ఉఠ్కంత రేకెత్తిస్తున్నాయి. రోజు రోజుకు పరిణామాలు మారిపోతున్నాయి. ఎట్టకేలకు రేపు అసెంబ్లీలో బల పరీక్షను నిర్వహించేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ సిద్ధమయ్యింది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు బలపరీక్ష కోసం ముంబాయి చేరుకోన్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే కు మద్దతుగా నిలిచేందుకు ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ ముఖ్ ప్రయత్నాలు చేస్తున్నారు. వారిద్దరూ ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్నారు.
ఉదయ్ పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ మర్డర్: కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్షలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ ముఖ్ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి తరుఫు న్యాయవాదులు బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సుప్రీంకోర్టు అంగీకరించింది. సాయంత్రం 5.30 గంటలకు దీనిని విచారించనుంది. బలపరీక్షకు గవర్నర్ ఇచ్చిన పిలుపును సవాల్ చేస్తూ శివసేన లెజిస్లేచర్ పార్టీ చీఫ్ విప్ సునీల్ ప్రభు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఎదుట ప్రవేశపెట్టనుంది.
ఒకే ఇంట్లో తొమ్మిది మృతదేహాలు.. అవి ఆత్మహత్యలు కాదు హత్యలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలిశారు. ఎంవీఏ ప్రభుత్వాన్ని బల నిరూపణ చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో గవర్నర్ గురువారం అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో మెజారిటీ నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ ప్రత్యేక సమావేశం రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
అయితే ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు అస్సాంలోని గౌహతిలో ఉన్నారు. అక్కడ ఓ లక్సరీ హోటల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అయితే వీరంతా గోవాకు వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ఫ్లోర్ టెస్ట్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ని కూడా బుధవారం సాయంత్రం 5 గంటలకు కోర్టు విచారణకు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.