భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో అస్త్రం.. నేవీలో చేరిన వాగిర్‌ సబ్‌మెరైన్‌.. 

By Rajesh KarampooriFirst Published Dec 21, 2022, 12:23 AM IST
Highlights

కల్వరి విభాగం చెందిన జలాంతర్గామి వాగిర్‌ భారత నౌకాదళం అమ్ములపొదిలో చేరింది. ఈ సబ్‌మెరైన్‌ను నేవీ అధికారులకు అప్పగించారు. కేవలం 24 నెలల వ్యవధిలో మూడవ జలాంతర్గాములు  భారత నౌకాదళంలో చేరాయి. ఇది ప్రాజెక్ట్‌-75 లోని ఐదో కల్వరి తరగతి జలంతర్గామి యార్డ్ 11879. ఈ ప్రాజెక్ట్‌ కింద మొత్తం ఆరు జలంతర్గాములను స్కార్పెన్‌ డిజైన్ సంస్థ తయారుచేసి ఇవ్వనున్నది.

భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. దేశీయంగా తయారైన ‘వాగిర్’ సబ్ మెరైన్ మంగళవారం నావికా దళంలో చేరిందని ఇండియన్ నేవీ వెల్లడించింది. ఇది కల్వరి తరగతికి చెందిన ఐదో సబ్ మెరైన్. ప్రాజెక్ట్-75లో భాగంగా కల్వరి తరగతికి చెందిన ఇలాంటి జలాంతర్గాములు ఆరు తయారు చేయాలని భారత నావికాదళం నిర్ణయించింది. ఈ జలాంతర్గాములను మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబైలో నిర్మిస్తుంది.ఫ్రాన్స్ దేశానికి చెందిన నావల్ గ్రూప్ కూడా ఈ మేరకు సహకారం అందిస్తుంది. 6 జలాంతర్గాములను తయారు  చేసేందుకు 2005లో ఒప్పందం కుదిరింది. ఈ జలాంతర్గాములు భారత నావికాదళ బలాన్ని పెంచుతాయని నేవీ అధికారులు తెలిపారు. ఇది ఇతర జలాంతర్గాములతో పోలిస్తే అతి తక్కువ సమయంలో ఆయుధాలు , సెన్సార్ల యొక్క ప్రధాన ట్రయల్స్‌ను పూర్తి చేసుకోవడం విశేషం. 

జలాంతర్గామి ప్రత్యేకతలు 

INS వాగిర్ 12 నవంబర్ 2020న ప్రారంభించబడింది. ఆ తర్వాత 01 ఫిబ్రవరి 22 నుండి సముద్రంలోని ప్రవేశించింది. ఈ జలాంతర్గామి తన ట్రయల్స్‌ను అతి తక్కువ సమయంలో పూర్తి చేసింది. దీనితో పాటు ఆయుధం సెన్సార్ పరీక్షలలో కూడా ఇది అగ్రస్థానంలో ఉంది.ఈ జలాంతర్గామి దాదాపు 220 అడుగుల పొడవు , 40 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే.. ఈ జలాంతర్గాములు ఉపరితలంపై గరిష్టంగా 11 నాట్ల వేగంతో,  నీటి అడుగున 20 నాట్ల వరకు ప్రయాణించగలదు. కల్వరి-తరగతి చెందిన అన్ని సబ్‌మెరైన్‌లు యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ, మైన్ లేయింగ్ సహా నిఘాను సేకరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ జలాంతర్గాముల నిర్మాణం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ.

ఇతర కల్వరి తరగతి జలాంతర్గాములు:

కల్వరి తరగతికి చెందిన ఇతర జలాంతర్గాములలో INS కల్వరి, INS కరంజ్, INS ఖండేరి , INS వేలా ఉన్నాయి. ఇప్పటికే ఇండియన్ నేవీలో చేర్చారు. INS వాగిర్ ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగించారు. మొదటి జలాంతర్గామి INS కల్వరి డిసెంబర్ 2017లో రెండవ జలాంతర్గామి INS ఖండేరి సెప్టెంబర్ 2019లో, మూడవ సబ్‌మెరైన్ INS కరంజ్ మార్చి 2021లో,నాల్గవ INS వేలా నవంబర్ 2021లో ప్రారంభించబడ్డాయి.

ప్రాజెక్ట్ 75 అంటే ఏమిటి?

భారత నౌక దళంలో 25 జలాంతర్గాములను చేర్చాలని అప్పటి ఐకే గుజ్రాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రాజెక్ట్ 75 (P75) రూపొందించబడింది. P75 కింద జలాంతర్గాముల నిర్మాణానికి 30 సంవత్సరాల ప్రణాళిక పట్టింది. ఈ మేరకు 2005లో ఆరు కల్వరి-తరగతి జలాంతర్గాములను నిర్మించడానికి భారత్, ఫ్రాన్స్ మధ్య $3.75 బిలియన్ల ఒప్పందం  జరిగింది. ఇందులో భాగంగా కల్వరి తరగతికి చెందిన మొదటి జలాంతర్గామిని 2017లో నేవీ అందుకుంది. గత 24 నెలల వ్యవధిలో మూడో జలాంతర్గామిని భారత నౌకాదళానికి అందించారు.

జలాంతర్గాములను త్వరలో భారత నౌకాదళంలోకి ప్రవేశించబడుతుంది. భారత నౌకాదళ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.   కల్వరి తరగతికి చెందిన ఐదవ జలాంతర్గామి వగీర్‌ను గురువారం ముంబైలోని మజాగాన్ డాక్‌లో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రాజెక్ట్-75 కింద భారతదేశం స్కార్పెన్ తరగతికి చెందిన ఐదు జలాంతర్గాములను నిర్మించింది. ఆరవ జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్ పనులు అధునాతన దశకు చేరుకున్నాయి.  

click me!