గాడ్సే భారతదేశపు తొలి ఉగ్రవాది.. : అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్య‌లు

Published : Apr 08, 2023, 11:30 AM IST
గాడ్సే భారతదేశపు తొలి ఉగ్రవాది.. : అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్య‌లు

సారాంశం

Hyderabad: శ్రీరామనవమి సందర్భంగా బీహార్, పశ్చిమబెంగాల్లో హింస చెలరేగింది. అదే సమయంలో హైదరాబాద్ లో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా నాథూరామ్ గాడ్సే ఫొటోతో పలువురు డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. ఇదే విష‌యంపై హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.  

AIMIM chief Asaduddin Owaisi: "నాథూరామ్ గాడ్సే భారతదేశపు తొలి ఉగ్రవాది.. మహాత్మాగాంధీని కాల్చి చంపిన వారి ఫొటోలతో డ్యాన్స్ చేస్తున్న వారు ఎవరు? ఒసామా బిన్ లాడెన్ ఫోటో తీసి ఎవరైనా ఇలా చేసి ఉంటే మజ్లిస్ కారణంగా హైదరాబాద్ ఉగ్రవాదుల స్థావరంగా మారిందని, పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి ఉండేవారు. కానీ ఇప్పుడు పోలీసులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?.." అని హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ  అన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే..  శ్రీరామనవమి సందర్భంగా బీహార్, పశ్చిమబెంగాల్లో హింస చెలరేగింది. అదే సమయంలో హైదరాబాద్ లో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా నాథూరామ్ గాడ్సే ఫొటోతో పలువురు డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు. ఇదే విష‌యంపై హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. గాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే ను భార‌త దేశ‌పు తొలి ఉగ్ర‌వాది అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

పోలీసుల తీరుపై ప్ర‌శ్నాలు... 

భార‌త జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సే ఫొటోను శ్రీరామ న‌వ‌మి ఊరేగింపులో ప్రదర్శించడంపై ఒవైసీ మాట్లాడుతూ.. "గాడ్సే ఫొటోను హైదరాబాద్ కు తీసుకువస్తున్నారన్నారు. గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే  భార‌త తొలి ఉగ్రవాది..  ఆయన ఫొటోతో ప‌లువురు డ్యాన్స్ చేస్తున్నారు. రామనవమి ఊరేగింపు సందర్భంగా నాథూరామ్ గాడ్సే చిత్రాన్ని చూపిస్తున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒసామా బిన్ లాడెన్ చిత్రాన్ని ఎవరైనా తీసుకువస్తే మజ్లిస్ కారణంగా హైదరాబాద్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందని అంటున్నారని" అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ విష‌యంలో హైద‌రాబాద్ పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని ప్ర‌శ్నించారు.

బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై విమ‌ర్శ‌లు.. 

ఈ క్ర‌మంలోనే బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ పై కూడా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. "ఆయనతో మీ రిలేషన్ ఏంటి చెప్పండి" అని ఓవైసీ ప్రశ్నించారు. "టీవీలో తమ్ముడి ఫోటో చూస్తున్నట్టు మౌనంగా వుండిపోయాడు, ఎందుకంత నిశ్శబ్దం అని నాకర్థం కావడం లేదని" మండిప‌డ్డారు.అలాగే, బీహార్ లో మదర్సా అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను టార్గెట్ చేశారు. హింసాకాండపై సీఎం నితీశ్ మౌనాన్ని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.

శ్రీరామనవమి రోజున సీతారాంబాగ్ లోని ఓ ఆలయం నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఆధ్వర్యంలో ఊరేగింపు గోషామహల్ లోని వివిధ ప్రాంతాల గుండా సాగింది. ఈ యాత్రలో ప్రజలు చేతిలో కాషాయ జెండాతో నాథూరామ్ గాడ్సే చిత్రపటంతో డాన్సులు చేస్తూ కనిపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు