జాతీయ జెండాకు ఘోర అవమానం.. పుచ్చకాయపై దుమ్మును శుభ్రం చేసేందుకు వినియోగం.. వైరల్ వీడియో..!!

Published : Apr 08, 2023, 10:55 AM IST
జాతీయ జెండాకు ఘోర అవమానం.. పుచ్చకాయపై దుమ్మును శుభ్రం చేసేందుకు వినియోగం.. వైరల్ వీడియో..!!

సారాంశం

జాతీయ జెండాను ఓ వ్యక్తి అవమానించాడు. దేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండే.. త్రివర్ణ పతాకాన్ని పుచ్చకాయల దుమ్మును శుభ్రం చేయడానికి వినియోగించాడు.

జాతీయ జెండాను ఓ వ్యక్తి అవమానించాడు. దేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండే.. త్రివర్ణ పతాకాన్ని పుచ్చకాయల దుమ్మును శుభ్రం చేయడానికి వినియోగించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వ్యక్తి పుచ్చకాయల దుమ్మును శుభ్రం చేయడానికి జాతీయ జెండాను ఉపయోగించాడు. ఇందుకు సంబంధించి వీడియోను చిత్రీకరించిన స్థానికులు.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ఓ నెటిజన్.. ‘‘ఝాన్సీలో జాతీయ జెండా నుండి పుచ్చకాయను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది సంథార్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది’’ అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అయితే దీనిపై స్పందించిన ఝాన్సీ పోలీసులు.. ఇందుకు సంబంధించి తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంథార్ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ను ఆదేశించినట్టుగా చెప్పారు. ఆ తర్వాత సంబంధిత సెక్షన్ల కింద సంథార్ పోలీసు స్టేషన్‌లో నిందితుడిపై అభియోగపత్రం నమోదు చేయబడిందని పేర్కొంది. 

 

ఇక, దేశంలో జాతీయ పతాకాన్ని అగౌరవపరిచే ఘటన వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఢిల్లీలో 52 ఏళ్ల వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని శుభ్రం చేయడానికి జాతీయ జెండాను ఉపయోగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి  తెలిసిందే. దీంతో అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?