భారీగా కోవిడ్ కేసులు న‌మోదు.. క‌రోనా వైర‌స్ తో కొత్త‌గా 11 మంది మృతి

By Mahesh RajamoniFirst Published Apr 8, 2023, 11:11 AM IST
Highlights

New Delhi: కేంద్ర‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం క‌రోనా వైరస్ కారణంగా కొత్తగా 11 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 5,30,954కి పెరిగింది. అత్యవసర హాట్ స్పాట్ల‌ను గుర్తించి, పరీక్షలను పెంచాలని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలను కోరినట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 
 

Coronavirus-India: మ‌ళ్లీ దేశంలో కోవిడ్-19 క‌ల‌క‌లం రేపుతోంది. రోజురోజుకూ కోవిడ్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వ‌రుస‌గా రెండో రోజు ఆరు వేల‌కు పైగా కోవిడ్-19 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో యాక్టివ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. అత్యవసర హాట్ స్పాట్ల‌ను గుర్తించి, పరీక్షలను పెంచాలని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలను కోరినట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో వ‌రుస‌గా రెండో రోజు ఆరు వేల‌కు పైగా క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. భారతదేశంలో శనివారం 6,155 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇది శుక్రవారం న‌మోదైన‌ 6,050 ఇన్ఫెక్షన్ల నుండి పెరిగింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,51,259 కు చేరుకుంది. క్రియాశీల కేసుటు సైతం  31,194కు చేరుకున్నాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, వైరస్ కారణంగా కొత్తగా 11 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 5,30,954కి పెరిగింది. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర ప్ర‌భుత్వం.. అత్యవసర హాట్ స్పాట్ల‌ను గుర్తించి, కోవిడ్ పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరిందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. జన్యు పరీక్షలను పెంచాలని, ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్ర‌వారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల‌ సమావేశంలో రాష్ట్రాలను ఆదేశించారు.

ప్ర‌స్తుత వైద్య నివేదిక‌ల ప్ర‌కారం.. కొత్తగా ఉద్భవించిన కోవిడ్ -19 వేరియంట్ ఎక్స్ బీబీ.1.16 దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించారు. ఇది ఇప్పటివరకు సంక్రమణలో 38.2 శాతంగా ఉంద‌ని తేలింది. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో న‌మోదైన కొత్త కేసుల్లో 90 శాతానికి పైగా కేసుల్లో ఈ వేరియంట్ ను గుర్తించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఢిల్లీ స‌ర్కారు.. కోవిడ్ వ్యాప్తి నివార‌ణ‌కు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపింది. కేసులు పెరిగితే దానికి అనుగుణంగా ప‌రిస్థితుల‌ను ఎదుర్కొవ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని పేర్కొంది. 

ఒమిక్రాన్ వేరియంట్, దాని ఉపజాతులు భారతదేశంలో ఆధిపత్య వేరియంట్లుగా కొనసాగుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని పశ్చిమ, దక్షిణ, ఉత్తర ప్రాంతాలలో సంక్రమణ రేటులో పెరుగుదలను గమనించినట్లు చెబుతున్నారు. కొత్తగా ఉద్భవించిన రీకాంబినెంట్ వేరియంట్ ఎక్స్ బీబీ.1.16 భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో గమనించబడింది. ఇది ఇప్పటివరకు సంక్రమణలో 38.2 శాతంగా ఉంద‌ని కోవిడ్ బులెటిన్ తెలిపింది. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, దేశవ్యాప్త కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ల ప్ర‌జ‌ల‌కు వేశారు.
 

click me!