Survey: లోక్ సభ ఎన్నికల్లో విపక్ష కూటమికి గెలుస్తుందా? ఎన్డీఏ పరిస్థితి ఏమిటీ? ఏబీవీ సీవోటర్ సంచలన సర్వే

By Mahesh K  |  First Published Dec 25, 2023, 10:31 PM IST

ఏబీపీ సీవోటర్ ఒపీనియన్ పోల్స్ సర్వే సంచలన విషయాలను వెల్లడించింది. మూడో సారి నరేంద్ర మోడీ ప్రభుత్వమే కేంద్రంలో కొలువుదీరుతుందని, ప్రతిపక్ష కూటమి మెజార్టీకి ఆమడదూరంలో నిలుస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
 


Lok Sabha Elections: హిందీ బెల్ట్ రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్తాన్‌లో బీజేపీ విజయపతాకాన్ని ఎగరేసి లోక్ సభ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నది. ఇదే దూకుడుతో లోక్ సభ ఎన్నికల్లోనూ అద్భుతాలు సృష్టించాలని అనుకుంటున్నది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుండగా.. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన పై రెండు కూటముల్లోనూ లేవు. 

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏబీపీ సీ వోటర్ ఓ ఓపీనియన్ పోల్స్ నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ సర్వే మొత్తం దేశాన్ని తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణ జోన్‌లుగా పరిగణనలోకి తీసుకుని ఒపీనియన్ సర్వే తయారు చేసింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర జోన్‌లలో బీజేపీ జోరు మీదుండగా, దక్షిణ జోన్‌లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.  ఈ సర్వే ప్రకారం.. 

Latest Videos

undefined

బిహార్, జార్ఖండ్, ఒడిశా, బెంగాల్ వంటి తూర్పు జోన్‌లో బీజేపీకి 80 నుంచి 90 సీట్లు, 42 శాతం ఓటు షేర్ దక్కనుంది. అదే ఇండియా కూటమికి 50 నుంచి 60 సీట్లు, 38 శాతం ఓటు షేర్ లభిస్తుంది. ఇతరులకు పది నుంచి 20 స్థానాలు లభిస్తాయి.

Also Read: Pakistan: పాకిస్తాన్ ఎన్నికల్లో ఉగ్రవాది హఫీజ్ సయీద్ కొడుకు పోటీ

అదే ఉత్తర జోన్‌(మర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, యూపీ వంటి రాష్ట్రాలు)లో మొత్తం 180 సీట్లల్లో 50 శాతం ఓటు షేర్‌తో బీజేపీ 150 నుంచి 160 స్థానాలను గెలుచుకుంటుంది. అదే ఇండియా కూటమి 36 శాతం ఓటు షేర్‌తో 20 నుంచి 30 సీట్లు గెలుచుకుంటుంది. ఇతరులు 5 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇక తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలున్న దక్షిణ జోన్‌లో 132 సీట్లకు గాను బీజేపీ 20 నుంచి 30 సీట్లు, 19 శాతం ఓటు షేర్ పొందే అవకాశాలున్నాయి. అదే ఇండియా కూటమికి 40 శాతం ఓటు షఏర్‌తో 70 నుంచి 80 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. ఈ రెండు కూటముల కంటే కూడా అధికంగా ఇతరులు(బీఆర్ఎస్, వైసీపీ వంటి పార్టీలు) 41 శాత ఓటు షేర్‌తో 25 నుంచి 35 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

Also Read: క్లాస్‌మేట్‌ను పెళ్లి చేసుకోవాలని లింగ మార్పిడి చేసుకుంది.. తర్వాత ఆమెనే చంపేసింది

గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలున్న పశ్చిమ జోన్‌(మొత్తం 78 సీట్లు)లో బీజేపీ 46 శాతం ఓటు షేర్‌తో 45 నుంచి 55 సీట్లు గెలుచుకుంటుంది. అదే కాంగ్రెస్ కూటమి 25 నుంచి 35 సీట్లు గెలుచుకుంటుంది. ఇతరులు 5 సీట్ల వరకు గెలుచుకోవచ్చు.

మొత్తంగా దేశవ్యాప్తంగా కలిపి చూస్తే.. మొత్తం 543 పార్లమెంటు స్థానాలకు గాను బీజేపీ కూటమి 42 శాతం ఓటు షేర్‌తో 295 నుంచి 335 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అదే కాంగ్రెస్ కూటమి 38 శాతం ఓటు షేర్‌తో 165 నుంచి 205 సీట్లను గెలుచుకోవచ్చు. ఇతరులు 20 శాతం ఓటు షేర్‌తో 35 నుంచి 65 సీట్లు గెలుచుకోవచ్చు.

Also Read: Group 2: గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా?

ఏబీపీ సీవోటర్ ఒపీనియన్ పోల్స్‌ ఆధారంగా చూస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతుందని అర్థం అవుతున్నది. విపక్ష కూటమి మాత్రం మెజార్టీకి ఆమడ దూరంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

click me!