ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఇవాళ క్రిస్ మస్ సంబరాలు జరిగాయి.ఈ సంబరాల్లో పలువురు క్రిస్టియన్లు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారంనాడు న్యూఢిల్లీలోని తన నివాసంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు క్రిస్టియన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో పలువురు పాల్గొన్నారు. ఈ ఫోటోలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.
undefined
క్రిస్ మస్ ను పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని క్రిస్టియన్లకు ఆయన గ్రీటింగ్స్ చెప్పారు. వాటికన్ సిటీలోని పోప్ ఫ్రాన్సిస్ తో 2021లో తాను కలిసిన సందర్భాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు.ఆ సందర్భం తనకు అత్యంత మరిచిపోలేదనిదిగా పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లు తన నివాసానికి రావడం తనకు సంతోషాన్ని కల్గించిందన్నారు.
క్రీస్తు జన్మించిన రోజును క్రిస్‌మస్ గా జరుపుకుంటామని ప్రధాని చెప్పారు. యేసుక్రీస్తు ఇచ్చిన సందేశం, ఆయన నేర్పిన విలువలు ఎప్పటికి ఆచరించదగినవన్నారు. వాతావరణ మార్పులు, ప్రపంచంలో అంతా సోదర భావంతో మెలగడం వంటి అంశాలపై పోప్ ఫ్రాన్సిస్ తో చర్చించినట్టుగా ప్రధాని చెప్పారు.